Jump to content

నీలా రామగోపాల్

వికీపీడియా నుండి
నీలా రామగోపాల్
వ్యక్తిగత సమాచారం
జననం (1935-05-25) 1935 మే 25 (వయసు 89)[1]
చెన్నై, తమిళనాడు, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిగాత్ర విద్వాంసురాలు

నీలా రామగోపాల్ తమిళనాడుకు చెందిన కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసురాలు.

విశేషాలు

[మార్చు]

ఈమె 1935, మే 25న చెన్నై నగరంలో జన్మించింది.[1] ఈమె ఎన్.ఎం.నారాయణన్, టి.కె.రంగాచారిల వద్ద కర్ణాటక సంగీతాన్ని అభ్యసించింది. ఈమె అనేక కచేరీలు చేసింది. ఈమె సంగీత విషయాలపై అనేక గ్రంథాలను ప్రకటించింది. ఈమె కర్ణాటక సంగీతంపై అనేక సెమినార్లను, వర్క్‌షాపులను నిర్వహించింది. ఈమె మద్రాసు సంగీత అకాడమీ వంటి అనేక సంస్థలతో అనుబంధాన్ని కలిగి ఉంది. ఈమె ఎందరో విద్యార్థులకు సంగీతం నేర్పి వారిని సంగీతకళాకారులుగా తీర్చిదిద్దింది. "నీలా రామగోపాల్ - ఎ మ్యూజికల్ జర్నీ" అనే పేరుతో ఈమె జీవితచరిత్రను హరిణి రాఘవన్ అనే రచయిత్రి రచించింది. ఈమె నీలాంబరి అనే సంస్థను స్థాపించి తద్వారా కర్ణాటక సంగీతానికి ప్రచారం కల్పిస్తున్నది.

అవార్డులు

[మార్చు]

కర్ణాటక సంగీత రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా ఈమెకు అనేక పురస్కారాలు, బిరుదులు లభించాయి.

వాటిలో ముఖ్యమైనవి కొన్ని:

  • 2011లో మద్రాసు సంగీత అకాడమీ వారిచే "సంగీత కళాచార్య"
  • 2003లో బెంగళూరు గాయన సమాజ వారిచే "సంగీత కళారత్న"
  • 2015లో నాదసురభి బెంగళూరు వారిచే "సంగీత సురభి"
  • నాగర్ కోయిల్ ట్రస్టు వారిచే "గాన ప్రకీర్తి"
  • రామకృష్ణ గానసభ వారిచే "సంగీత కళాసామ్రాజ్ఞి"
  • రామ సేవా మండలి వారిచే "సంగీత చూడామణి"
  • కర్ణాటక సంగీత నృత్య అకాడమీ వారిచే "కర్ణాటక కళాశ్రీ"
  • కాంచనశ్రీ లక్ష్మీనారాయణ మ్యూజిక్ అకాడమీ ట్రస్టు వారిచే "కాంచనశ్రీ"
  • 2016లో సంగీత నాటక అకాడమీ అవార్డు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 web master. "Neela Ramgopal". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 1 మార్చి 2021. Retrieved 1 March 2021.