Jump to content

నీల్ ఓబ్రీన్

వికీపీడియా నుండి
నీల్ ఓబ్రిన్
నీల్ ఓబ్రిన్
జననంనీల్ అలోసియస్ ఓబ్రిన్
మే 10, 1930
మరణంజూన్ 24, 2016
కోల్‌కత్తా
మరణ కారణంఅనారోగ్యము
వృత్తికౌన్సిల్ ఫర్ ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CICSE)
ప్రసిద్ధిక్విజ్ మాస్టర్
పదవి పేరుఛైర్మన్
మతంక్రిస్టియన్
పిల్లలుడెరెక్ ఓబ్రిన్, ఆండీ ఓబ్రిన్, బ్యారీ ఓబ్రిన్
తండ్రిఆమోస్ పీటర్ ఓబ్రీన్
Notes
భారత దేశపు మొట్టమొదటి క్విజ్ మాస్టర్.

నీల్ అలోయ్‌సియన్ ఓబ్రీన్(Neil Aloysius O'Brien) కలకత్తాకు చెందిన ఆంగ్లో ఇండియన్. ఇతడు భారతదేశంలో మొట్టమొదటి సారిగా క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించినవాడుగా ప్రసిద్ధుడు. విద్యావేత్తగా, ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నాయకుడిగా కన్నా ఇతడు క్విజ్ మాస్టర్‌గానే సుప్రసిద్ధుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1934,మే 10వ తేదీన జన్మించాడు.[1] కలకత్తాలోని సెయింట్ జేవియర్స్ స్కూలు, కాలేజీలలో ఇతని విద్యాభ్యాసం జరిగింది. ఇతని తండ్రి డా.ఆమోస్ పీటర్ ఓబ్రీన్ అడుగుజాడలలో నడిచి ఇతడు తను చదివిన సెయింట్ జేవియర్స్ స్కూలులోనే ఉపాధ్యాయుడిగా వృత్తిని చేపట్టాడు. ఇతడు 11వ లోక్‌సభకు ఆంగ్లో ఇండియన్ ప్రతినిధిగా నియమించబడ్డాడు. అంతకు ముందు పశ్చిమ బెంగాల్ శాసనసభకు మూడు సార్లు ఆంగ్లో ఇండియన్ ప్రతినిధిగా ఎంపికైయ్యాడు. ఇతడు కౌన్సిల్ ఫర్ ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CICSE)కు ఛైర్మన్‌గా 1993-2011ల మధ్య పనిచేశాడు. ఇతడు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఇండియా)కు మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఆల్ ఇండియా ఆంగ్లో ఇండియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ప్రాంక్ ఆంథోని గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్‌గా సేవలను అందించాడు.[2] ఇతని భార్యపేరు జాయిస్ ఓబ్రీన్.ఇతనికి ముగ్గురు కుమారులు. వీరిలో డెరెక్ ఓబ్రీన్, బ్యారీ ఓబ్రీన్‌లు కూడా క్విజ్ మాస్టర్లుగా, రాజకీయవేత్తలుగా రాణించారు. డెరెక్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు కాగా బ్యారీ భారతీయ జనతా పార్టీ నాయకుడు. 82యేళ్ల నీల్ ఓబ్ర్రీన్ 2016, జూన్ 24వ తేదీన కన్నుమూశాడు.[3]

క్విజ్ కార్యక్రమాలు

[మార్చు]

విద్యాభ్యాసం తరువాత 1967లో ఇంగ్లాండునుండి తిరిగి వచ్చిన నీల్ ఓబ్రిన్ మొదటి సారి కోల్‌కత్తాలోని క్రైస్ట్ ది కింగ్ చర్చిలో క్విజ్ షోను నిర్వహించాడు. మొదట కలకత్తాలోని ఆంగ్లో ఇండియన్లను మాత్రమే ఆకర్షించిన ఈ క్విజ్ కార్యక్రమాలు క్రమేపీ దేశవ్యాప్తంగా ప్రజలకు ఇష్టమైన కార్యకమంగా మారింది. బ్రిటిష్, అమెరికా క్విజ్ ప్రోగ్రాములకు భిన్నంగా భారతీయులకు సరిపోయే విధంగా ఇతడు తన కార్యక్రమాలను నిర్వహించేవాడు. ఇతని క్విజ్ కార్యక్రమాలు విభిన్న వయసులవారికి, విభిన్న అభిరుచులు కలవారికి ఆకర్షణీయంగా మారింది. ఇతడు రేడియో, టెలివిజన్‌లలో ఎన్నో క్విజ్ కార్యక్రమాలను నడిపాడు. చాలా దేశంలోని పలు దినపత్రికలలో క్విజ్‌కు సంబంధించిన అనేక శీర్షికలను నిరంతరంగా నిర్వహించాడు.

మూలాలు

[మార్చు]
  1. STAFF, REPORTER (25 June 2016). "Buzzer silent for quizmaster". The Telegraph. Retrieved 25 June 2016.
  2. "Neil O'Brien passes away". The Statesman. The Statesman Limited. 25 June 2016. Archived from the original on 27 జూన్ 2016. Retrieved 25 June 2016.
  3. Chaudhuri, Drimi (25 June 2016). "Quiz master Neil O'Brien passes away". Deccan Herald. The Printers (Mysore) Private Ltd., Bengaluru. Retrieved 25 June 2016.