నీల్ మోహన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2023

నీల్ మోహన్ అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్. ఆయన 2023 ఫిబ్రవరి 16న యూట్యూబ్‌ సీఈఓగా వ్యవహరించిన సూసన్ వోజిస్కీ రాజీనామా చేయడంతో యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టాడు.[1]

విద్యాభాస్యం

నీల్ మోహన్ 1996లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఆ తర్వాత నీల్ 2005లో స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు.[2]

వృత్తి జీవితం

నీల్ మోహన్ 1996లో మొదట యాక్సెంచర్‌లో పని చేసి, ఆ తర్వాత నెట్‌గ్రావిటీ స్టార్టప్‌ కంపెనీలో చేరి, తరువాత జూన్ 2004 నుండి సెప్టెంబర్ 2004 వరకు మైక్రోసాఫ్ట్‌లో కార్పొరేట్ స్ట్రాట‌జీ మేనేజ‌ర్‌గా, ఆ తరువాత ఐదేళ్ల పాటు డబుల్‌క్లిక్‌లో పని చేశాడు. ఆయన 2015 నుండి యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గా, బయో-టెక్ కంపెనీ 23అండ్‌మి, వస్త్రాల తయారీ కంపెనీ స్టిచ్ ఫిక్స్‌లలో బోర్డు సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు. నీల్ మోహన్ నాయకత్వంలో యూట్యూబ్‌లో యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్‌ షార్ట్‌లతో సహా అనేక విజయవంతమైన ఉత్పత్తులు, ఫీచర్‌లను కంపెనీ విడుదల చేసి వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కంటెంట్ సజెస్ట్ చేసే అల్గారిథమ్ లను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించాడు.[3] నీల్ మోహన్ 2023 ఫిబ్రవరి 16న యూట్యూబ్ సీఈఓగా పని చేసిన సూసన్ వోజిస్కీ రాజీనామా చేయడంతో యూట్యూబ్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టాడు.[4]

మూలాలు

  1. "యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్.. ఇదీ ఆయన ప్రొఫైల్". 17 February 2023. Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
  2. BBC News తెలుగు (17 February 2023). "నీల్ మోహన్: ఈ యూట్యూబ్ కొత్త సీఈఓ ఎవరు". Retrieved 17 February 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Eenadu (17 February 2023). "YouTube: యూట్యూబ్ సీఈవోగా భారతీయుడు నీల్‌ మోహన్‌ నియామకం". Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
  4. Hindustantimes Telugu (17 February 2023). "YouTube CEO : యూట్యూబ్ సీఈఓగా భారతీయ అమెరికన్ నీల్ మోహన్". Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.