Jump to content

నుమాయిష్ (2022)

వికీపీడియా నుండి
(నుమాయిష్‌ (2022) నుండి దారిమార్పు చెందింది)
అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన
2012లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని నుమాయిష్ ముఖద్వారం
ప్రక్రియస్టేట్ ఫెయిర్
తేదీలు1 జనవరి - 15 ఫిబ్రవరి
ప్రదేశంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
క్రియాశీల సంవత్సరాలు1938 - ప్రస్తుతం

నుమాయిష్‌ - 2022 (81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌, హైదరాబాదులో జనవరి 1 నుంచి 45 రోజుల పాటు జరిగింది. 1500 స్టాళ్లతో ఏర్పాటు చేసిన 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను 1 జనవరి 2021న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించింది.[1] కరోనా పాజిటివ్ కేసులు పెగుతుండటంతో నుమాయిష్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సోసైటీ తెలిపింది.[2]తరువాత కేసుల సంఖ్య తగ్గుదల వల్ల తిరిగి ఫిబ్రవరి 25 తారీఖున పునః ప్రారంభించింది.

నిర్వహణ

[మార్చు]

నాంప‌‌‌‌ల్లి ఎగ్జిబిష‌‌‌‌న్ గ్రౌండ్‌‌‌‌లో ప్రతి ఏటా జరిగే ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌‌‌‌ (నుమాయిష్) జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగనుంది. ప్రతి ఏటా దాదాపు 2500 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ కరోనా కారణంగా ఈ ఏడాది కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కేవలం 1500 స్టాళ్లకు మాత్రమే అనుమతులిచ్చారు. నుమాయిష్‌లో కరోనా వాక్సిన్ తీసుకొని వాళ్ల కోసం టీకా కేంద్రాన్ని కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో పలు అకాడమీలకు చెందిన పుస్తకాలతో పాటు అమ్యూజ్‌మెంట్‌ పార్కులో చిన్నారులను అలరించడానికి 16 రకాల గేమ్స్‌ రైడర్లు, రకరకాల వస్తువులు, రుచికరమైన ఆహార పదార్థాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి.[3]

నుమాయిష్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు మైదానంలోకి సందర్శకులను వాహనాలతో అనుమతిస్తారు. కారుకు రూ.600, ఆటోకు రూ.300, ద్విచక్ర వాహనానికి రూ.100 రుసుంగా నిర్ణయించారు.[4] ఈ ఎగ్జిబిష‌‌‌‌న్ కు ఎంట్రీ ఫీజు రూ.30, 5 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశంతో ఫ్రీ పార్కింగ్​ సదుపాయం కల్పించారు.[5]

ప్రారంభం

[మార్చు]

81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను (నుమాయిష్‌) నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జనవరి 1న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించింది.[6][7]

పునఃప్రారంభం

[మార్చు]

జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్‌-2022 ఆ మరుసటి రోజే జనవరి 2న కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మూసి వేసారు. ఇప్పుడు కొవిడ్‌ నిబంధనలు సడలించడంతో ఎగ్జిబిషన్‌ నిర్వహణపై ఎగ్జిబిషన్‌ సొసైటీ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు, ప్రభుత్వ శాఖల అధికారులు 2022 ఫిబ్రవరి 9న సమావేశమైయ్యారు. ఎగ్జిబిషన్‌ను తిరిగి ఫిబ్రవరి 20 నుంచి మార్చి నెలాఖరు వరకు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు.[8]

2022 ఫిబ్రవరి 25 నుంచి నుమాయిష్‌ - 2022ను తిరిగి నిర్వహించాలని ఎగ్జిబిషన్ సొసైటీ నిర్ణయించింది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది.[9][10][11]

నుమాయిష్‌ ద్వారం 2022

ఇవి చదవండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (1 January 2022). "నుమాయిష్-2022 ప్రారంభం". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
  2. TV9 Telugu (6 January 2022). "81వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ రద్దు.. రెండేళ్లుగా నుమాయిష్‌పై కరోనా దెబ్బ!". Archived from the original on 6 జనవరి 2022. Retrieved 6 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (29 December 2021). "నుమాయిష్‌కు ఏర్పాట్లు చకచకా". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  4. Andhrajyothy (1 January 2022). "నుమాయిష్-2022 ప్రారంభం". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  5. V6 Velugu (21 December 2021). "జనవరి 1 నుంచి నుమాయిష్" (in ఇంగ్లీష్). Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Eenadu (1 January 2022). "హైదరాబాద్‌ 'నుమాయిష్‌' ప్రారంభం". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
  7. Namasthe Telangana (1 January 2022). "హైదరాబాద్‌ నుమాయిష్‌కు ఎంతో చరిత్ర : గవర్నర్‌ తమిళిసై". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  8. "Telangana News: 20 నుంచి నుమాయిష్‌ పునఃప్రారంభం". EENADU. Retrieved 2022-02-10.
  9. "Numaish: 25 నుంచి నుమాయిష్‌ పునఃప్రారంభం: ఎగ్జిబిషన్ సొసైటీ". EENADU. Retrieved 2022-02-14.
  10. Andhra Jyothy (15 February 2022). "25 నుంచి Exhibition పునఃప్రారంభం." Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  11. Eenadu (26 February 2022). "'నుమాయిష్‌-2022' పునఃప్రారంభం". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.