నుమాయిష్ 2024
నుమాయిష్ 2024 (83వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, హైదరాబాదులో జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు జరగనుంది. 2400 స్టాళ్లతో ఏర్పాటు చేసిన 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను 2024 జనవరి 1న ప్రారంభమైంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 04.00 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నుమాయిష్ కొనసాగుతుంది.[1][2]
ప్రారంభం
[మార్చు]నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 2024 నుమాయిష్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.[3]
ప్రవేశం రుసుము & సమయం
[మార్చు]నుమాయిష్ ఎంట్రీ ఫీజు పెద్దలకు రూ.40గా ఉంది. సాధారణ రోజుల్లో రోజూ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 10.30 వరకూ ఉంటుంది. శని, ఆదివారాల్లో, సెలవు దినాల్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై, రాత్రి 11 గంటల వరకూ ఉంటుంది. ఈ సంవత్సరం నుమాయిష్‌లో జనవరి 9న లేడీస్ డే పేరుతో ఆ రోజు మహిళలకు, అలాగే జనవరి 31న చిల్డ్రన్స్ డే పేరుతో పిల్లలకు నిర్వాహకులు ఉచిత ప్రవేశం కల్పించారు.[4]
ట్రాఫిక్ మళ్లింపు
[మార్చు]- సిద్దంబర్‌బజార్ వైపు నుంచి నాంపల్లి వైపునకు వెళ్లే ఆర్టీసీ జిల్లా బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర భారీ వాహనాలను మొహింజామార్కెట్ వద్ద అబిడ్స్ వైపు మళ్లించారు.
- బషీర్‌బాగ్, కంట్రోల్ రూం వైపు నుంచి నాంపల్లికి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద బీజేఆర్ విగ్రహం, అబిడ్స్ వైపు మళ్లించారు.
- బేగంబజార్, ఛత్రి నుంచి మలాకుంట వైపు వెళ్లే వాహనాలను అలస్క జంక్షన్ వద్ద దారుసలాం, ఏక్‌మినార్ వైపు మళ్లించారు.
- దారుసలాం నుంచి అఫ్జల్‌గంజ్ వైపు వెళ్లే వాహనాలను అలస్క జంక్షన్ నుంచి బేగంబజార్, సిటీ కాలేజ్ వైపు మళ్లించారు.
- మూసాబౌలి, బహుదూర్‌పురా వైపు నుంచి నాంపల్లికి వెళ్లే వాహనాలను సిటీ కాలేజీ వద్ద నయాపూల్, ఎంజేమార్కెట్ రూట్‌లో మళ్లించారు.
మూలాలు
[మార్చు]- ↑ Namaste Telangana (27 December 2023). "జనవరి1 నుంచి నుమాయిష్". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
- ↑ V6 Velugu (26 December 2023). "నుమాయిష్‌లో..2,400 స్టాల్స్ కొనసాగుతున్న పనులు". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
{{cite news}}
: zero width space character in|title=
at position 9 (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (2 January 2024). "హైదరాబాద్ అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది: రేవంత్‌రెడ్డి". Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.
- ↑ Eenadu. "నుమాయిష్ షురూ". Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.