నూతన
నూతన 1978 లో ప్రారంభమైన తెలుగు మాసపత్రిక.
విశేషాలు
[మార్చు]1978లో నూతన విలక్షణ మాసపత్రిక ప్రారంభమైంది. సుమారు ఐదు సంవత్సరాల పాటు వెలువడింది. ఈ పత్రికకు ఎం.రత్నమాల సంపాదకురాలు. ఈ పత్రికకు వర్కింగ్ ఎడిటర్‌గా నమ్ము కొంతకాలం పనిచేశాడు. ఈ పత్రికలో కథలు, కవిత్వం, పాటలు ప్రచురించేవారు. ప్రజా సమస్యలమీద వ్యాసాలతోపాటు స్త్రీ విముక్తి పేరుతోమహిళల పేజీ ఉండేది. కొత్తగా రాయడం మొదలుపెట్టిన రచయితలను ఈ పత్రిక చాలా భిన్నమైన పద్ధతిలో ప్రోత్సహించేది. వారి రచనల్లోని లోటుపాట్లను చెప్పి సలహాలిస్తూ రచయిత బాగా అర్థం చేసుకుని తిరిగి పంపితే పత్రికలో ప్రచరించేవారు. ఈనాడు దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేసిన రత్నమాల సంపాదకురాలుగా ఈ పత్రిక ఐదేళ్ళపాటు నడిచి ఆగిపోయింది.
ఈ పత్రికలో కథలు, కవిత్వం, పాటలు ప్రచురించేవారు. ప్రజా సమస్యలమీద వ్యాసాలతోపాటు 'స్తీ విముక్తి' పేరుతో మహిళల పేజీ ఉండేది.[1]
మూలాలు
[మార్చు]- ↑ "...చైతన్య కరదీపికలు | మానవి | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2020-09-16.