Jump to content

నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం

వికీపీడియా నుండి
(నెమిలిగండల్ల రంగనాయకస్వామి నుండి దారిమార్పు చెందింది)
రంగనాయకస్వామి ఆలయం

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జల్లివాని పుల్లలచెరువుకు పడమటి దిక్కున అరు కిలోమీటర్ల దూరంలో వున్న నల్లమల అటవి ప్రాంతంలో నెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవాలయం ఉంది. గుండ్లకమ్మ నది, గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద ఆవిర్బవించి నల్లమల్ల గిరులలో సుడులు తిరిగి ఉత్తర దిక్కున రెండు కొండల మధ్య జాలువారి నెమలిగుండంలోకి చేరుతుంది.

క్షేత్ర ప్రాముఖ్యత

[మార్చు]

నల్లమల్ల అటవి ప్రాంతంలో మయూర మహర్షి ఆశ్రమాన్ని ఎర్పరుచుకొని మహావిష్ణువును ప్రసన్నం చేసుకొడానికి తపస్సు చేస్తూ తదేక దీక్షతొ తన ముక్కుపుటమతో ఒక గుండమును తవ్వి మట్టీని బయటకు తీయడంతొ మరుసటి సూర్యోదయానికి గుండం జలయంగా మారిందని ప్రతీతి. నెమలి ముఖ ఆకారంతో వున్న మహర్షిచే నిర్మితమెనందున నెమిలిగుండం అనే పేరు సార్థకమైనది. దీని చేంతనే మహా విష్ణువు రంగనాయకస్వామిగా వెలయడంతో నెమెలిగుండ్ల రంగనాయకస్వామి క్షేత్రంగా వాసికెక్కింది.

నల్లమల్ల కొండలలో ఇసుకగుండమనేచోట చెంచు జాతికి చెందిన బయన్న, బయ్యక్క దంపతులుండేవారు. వారి ఏకైక కుమార్తె పేరు రంగలక్ష్మీ. పెళ్ళిడు కొచ్చిన లక్ష్మీ తన కులాచారాన్ని ధిక్కరించి, కులపెద్దలతో విభేదించి మహావిష్ణువును పెళ్ళడాలనే తలంపుతో చెంచుగూడెం వదలి నెమలిగుండం చేరుకొని తపమాచరిస్తున్న మయార మహర్షికి తన మనోగతాన్ని వెల్లడి చేసింది. మనోభీష్ట సిద్దికోసం మహర్షితో కలసి తపమాచరించిది. ఎట్టకేలకు వారి తపస్సుకు చలించిన విష్ణువు ప్రసన్నుడై లక్ష్మీ భార్యగా స్వీకరించెను. మయార మహర్షి కొరిక మేరకు నెమలిగుండం ప్రక్కనే పడమటి కొండపైన స్వయంభుగా వెలసి భక్తుల పాలిట ఆరాధ్యదైవంగా వేలాధి కుటుంభాల ఇలవెలుపుగా పూజలందుకుంటున్నాడు. భూలోకం చేరిన విష్ణువును వెతుక్కుంటూ వైకుంఠం నుంచి వచ్చిన లక్ష్మి దేవి రంగ సమేతుడైన స్వామిపై అలిగి అక్కడే ఆలయానికి దగ్గర లో కొండపైన అమ్మవారు శిలగా మారి బాధపడుతూ ఉంటుంది అని , అక్కడ కొంత దూరం లో బొట్టు బొట్టు గా ప్రవహించే నీరు అమ్మవారి కన్నీరు అని చరిత్ర . ఇప్పటికీ అలాగే ఉండటం ఆలయ వైశిష్ట్యం గొప్పతనం. స్వామి వారికి ఆర్చక స్వాములు ప్రతీ శనివారం పాంచరాత్ర ఆగమోక్తము గా పూజలు చేయడం ఆనవాయతి. అమ్మవారి ఆలయము మరియు పరిసరాలను లక్ష్మమ్మ వనం గా పిలుస్త్తారు. ఏ క్షేత్రంలో కనిపించని ఆరుదైన పవిత్రత గొప్పదనం నెమలిగుండ్ల రంగనాయక స్వామికి ఉంది. అంటు, ముట్టులు వున్నవారు ఆలయం వద్దకు వస్తే తేనెటీగలు దాడి చేస్తాయి. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో బహుళ పాడ్యమి, విదియ, తదియ లో మూడు రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మొదటిరోజు అంకురార్పణ రెండవ రోజు స్వామి వారి లీలా కల్యాణోత్సవం మూడవ రోజు తెప్పోత్సవం దివ్య రధోత్సవం మొదలగు కార్యక్రమములు వైభవంగా జరుగును.

అటువంటి పవిత్రత వైశిష్ట్యం కలిగిన ఆలయం లో మార్గశిర కృష్ణ పక్ష దశమి దనుర్మాసం సందర్భంగా స్వామి వారికి ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో స్వామి వారి ప్రీతి కోసం 1008 కలశములతో మహా స్నపనం తదుపరి మహా సుదర్శన యాగం నిర్వహించడం జరుగుతున్నది భక్తులందరూ ఈ విశిష్ట కార్యక్రమం లో పాల్గొని ఆ రంగనాయకుని ఆశీస్సులు పొందగలరు అని తెలియజేయడం అయినది

ఈ ఆలయానికి వెళ్ళడానికి గిద్దలూరు నుంచి ప్రతి శనివారం apstrc వారు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం 5 00 నుంచి బస్సు బయలుదేరుతుంది . ప్రైవేటు వాహనాల్లో వచ్చేవారు కంభం మీదుగా అయితే అన్నంపల్లి నుంచి J . పుల్లల చెరువు మీదుగా స్వామి వారి క్షేత్రం చేరుకోవచ్చు. గిద్దలూరు నుంచి అంబవరం మీదుగా 20 km ప్రయాణం చేసి స్వామి వారి క్షేత్రం చేరుకోవచ్చు.