నెల్లూరి కేశవస్వామి
నెల్లూరి కేశవస్వామి | |
---|---|
జననం | 1920 హైదరాబాద్, తెలంగాణ |
మరణం | 1984 |
ప్రసిద్ధి | తొలితరం తెలంగాణ రచయిత, అనువాదకుడు. |
నెల్లూరి కేశవస్వామి (1920 - 1984) తొలితరం తెలంగాణ రచయిత, అనువాదకుడు.[1]
జననం
[మార్చు]నెల్లూరి కేశవస్వామి 1929 హైదరాబాద్ లో జన్మించాడు.[1]
ఉద్యోగ జీవితం
[మార్చు]ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన కేశవస్వామి చాలాకాలం నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాడు.[1]
రచన రంగం
[మార్చు]కేశవస్వామి కథలు, నవలలు, అనువాద నవలలు రచించారు. వీరి తొలి కథాసంపుటి పసిడి బొమ్మ. కేశవస్వామి కథాసంకలనం "చార్మినార్" ఆయనకు పురస్కారాలు, ప్రఖ్యాతి సంపాదించిపెట్టింది. ఈ కథా సంకలనాన్ని భాస్కర భట్ల కృష్ణారావుకు అంకితం చేశారు. "వెలుతురులో చీకటి" శీర్షికన వెలువడ్డ వీరి నవల ప్రసిద్ధి పొందింది. ఎన్నో రేడియో నాటికలు, నాటకాలు కూడా రచించారు. ప్రముఖ హిందీరచయిత ప్రేంచంద్ కథలను అనువదించాడు.[2]
రచించిన కథల జాబితా
[మార్చు]- అక్కయ్య పెళ్లి
- అతిథి
- అదృష్టం
- అభిమానం
- అలవాటు
- అసలేం జరిగిందంటే
- ఆఖరి ఆశ
- ఆఖరి కానుక
- ఊబి
- కన్నెరికం
- కపోతమూ-కావేషము
- కవి సమ్మేళనంలో
- కేవలం మనుషులం
- చతురస్రం[3]
- చోటా లీడర్
- నిట్టూర్పు
- పరీక్ష
- పరూక్ష
- పసిడి బొమ్మ
- పాలపొంగు
- పిరికివాడు
- పునర్జన్మ (మూలం: శ్రీనివాస్ రాయప్రోల్)
- ప్రజ, ఉద్యోగి, మంత్రి
- ప్రజాకవి
- ప్రతిష్ఠాపకుడు
- ప్రతీకారం
- భరోసా
- యుగాంతం
- రాజర్షి
- రాజుని గురించిన కథ
- రూహీ ఆపా
- వంశాంకురం
- విధివంచితులు
- విముక్తి
- వెలుతురులో
- షరీఫా
- సంస్కారము
- సవతి
వంటి కథలు రచించాడు.[4]
పురస్కారాలు
[మార్చు]కేశవస్వామి తమ కథాసంకలనం "చార్మినార్" ప్రసిద్ధ సాహితీపురస్కారమైన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం పొందాడు.[5]
మరణం
[మార్చు]హైదరాబాద్ నగర జీవితాన్ని, సంస్కృతిని తన కథల్లో చిత్రించిన కేశవస్వామి 1984లో మరణించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 జనంసాక్షి. "తెలంగాణ అలాయ్ బలాయ్ 14th". Retrieved 10 June 2017.[permanent dead link]
- ↑ తెలంగాణా విముక్తి పోరాట కథలు
- ↑ తెలుగువన్.కాం. "చతురస్రం (కథ)". www.teluguone.com. Retrieved 10 June 2017.
- ↑ కథానిలయం. "రచయిత: నెల్లూరి కేశవస్వామి". kathanilayam.com. Retrieved 10 June 2017.
- ↑ Sakshi (20 August 2017). "తెలుగు కథకు చార్మీనార్ నెల్లూరి". Archived from the original on 30 డిసెంబరు 2021. Retrieved 30 December 2021.
- All articles with dead external links
- Pages using div col with unknown parameters
- Wikipedia articles with VIAF identifiers
- తెలుగువారు
- 1920 జననాలు
- 1984 మరణాలు
- తెలుగు అనువాదకులు
- తెలుగు రచయితలు
- హైదరాబాదు జిల్లా ఇంజనీర్లు
- హైదరాబాదు జిల్లా రచయితలు
- హైదరాబాదు జిల్లా అనువాద రచయితలు
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు