నెల్లూరి పెద్దారెడ్డి
Jump to navigation
Jump to search
నెల్లూరి పెద్దారెడ్డి | |
---|---|
దర్శకత్వం | వి.జయరాం రెడ్డి |
స్క్రీన్ ప్లే | పోలూరు ఘటికాచాలం |
నిర్మాత | సి.హెచ్.రఘునాథ్ రెడ్డి |
తారాగణం | సతీష్ రెడ్డి మౌర్యానీ |
ఛాయాగ్రహణం | బాలసుబ్రహ్మణ్యం |
సంగీతం | గురురాజ్ |
నిర్మాణ సంస్థ | సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ |
విడుదల తేదీ | 16 మార్చి 2018[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నెల్లూరి పెద్దారెడ్డి 2018లో విడుదలైన తెలుగు సినిమా. సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై సీహెచ్ రఘునాథ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి వి. జయరాం రెడ్డి దర్శకత్వం వహించాడు, సతీష్ రెడ్డి, మౌర్యాని హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2018, మార్చి 18న విడుదలైంది.[2] ఈ సినిమా ‘ఊర్వశి ఓటిటి’ లో 2021 మే 21న విడుదలైంది.[3]
కథ నేపథ్యం
[మార్చు]ఓ ఊరిలో నలుగురికి మంచి చేసే ఊరి సర్పంచ్ అయిన పెద్దారెడ్డి (సతీష్ రెడ్డి) అదే ఊరిలో ఉండే కామాక్షి (మౌర్యాని) కుటుంబానికి ఆశ్రయమిస్తాడు. కామాక్షి తో పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది . ఈ విషయం పెద్దారెడ్డి భార్య ముంతాజ్ కు తెలియడంతో మీనాక్షి ని చంపించడానికి పన్నాగం పన్నుతుంది. ఈ క్రమంలో అతనికి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో పెద్దారెడ్డి ఏం చేశాడు అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- సతీష్ రెడ్డి - నెల్లూరి పెద్దారెడ్డి
- మౌర్యాని - కామాక్షి
- ముంతాజ్
- ప్రభాస్ శ్రీను - కుక్కుటేశ్వర్
- అంబటి శ్రీను
- లక్ష్మీ
- సుజాత
- బేబీ దివ్య
సాంకేతికవర్గం
[మార్చు]- ఫైట్స్: రవి
- ఎడిటింగ్: శ్రీను
- సంగీతం: గురురాజ్
- ఛాయాగ్రహణం: బాలసుబ్రహ్మణ్యం
- కథ-మాటలు-పాటలు-స్క్రీన్ ప్లే: పోలూరు ఘటికాచలం
- నిర్మాత: సి.హెచ్.రఘునాథ్ రెడ్డి
- రచన-దర్శకత్వం: వి.జయరాం రెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (12 March 2018). "నెల్లూరి పెద్దారెడ్డి నవ్వులు". Sakshi. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
- ↑ Vaartha (10 March 2018). "ముస్తాబైన 'నెల్లూరి పెద్దారెడ్డి'". Archived from the original on 19 మే 2021. Retrieved 19 May 2021.
- ↑ Santhosham (14 May 2021). "Nelluri Peddareddy : "నెల్లూరి పెద్దారెడ్డి" ఓటిటి విడుదల.! - Santosham Magazine". Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.