నేత్రవ్యాధులు చికిత్స

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తీసుకొనవలసిన జాగ్రత్తలు[మార్చు]

  • బాలబాలికలు పాఠశాలకు వెళ్ళే ముందు నేత్ర పరీక్షలు చేసుకుంటే కంటిలోపాలను ముందుగా సవరించి మెరుగైన విద్యాభ్యాసం చేయడానికి వీలుకలుగుతుంది.
  • సాధారణంగా కళ్ళను వార్షికంగా పరిశోధన చేయించుకోవడం అవసరం.
  • కంప్యూటర్ వంటివి చూసేసమయంలో కళ్ళకు ప్రతి 20 నిముషాలకు విశ్రాంతి ఇవ్వాలి. కంటిని చేతులతో కొన్ని సెకనులు మూసి విశ్రాంతి ఇవ్వడం లేక 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువు మీద దృష్టి సారించడం ఉత్తమం.

కళ్ళకలకలు[మార్చు]

కంటి కలక అనేది తాత్కాలిక నేత్రవ్యాధులలో ఒకటిగా భావించవచ్చు. ఈ వ్యాధి సోకినప్పుడు కళ్ళలో ముందుగా స్వల్పంగా మంట లేక అయోమయమైన బాధ ఉంటుంది. క్రమంగా కన్ను ఎర్రబడుతూ బాధ తీవ్రం ఔతూ ఉంటుంది. విపరీతంగా పుసి కడుతూ ఉంటుంది. ప్రస్తుతం వీటికి ఆయింటు మెంటు వాటితో నివారణ లభిస్తుంది. కంటి కలక ఆరంభం అయిన వెంటనే నేత్రవైద్యుని సంప్రదించి చికిత్స చేయించడం ఉత్తమం. ఒక కంటితో ఆరంభమై రెండవ కంటికి సోకే ప్రమాదం ఉంది. ఇది ఒకరి నుండి మరొకరికి సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన వారు కంటి అద్దాలను వాడడం ద్వారా ఇతరులకు వ్యాపించడం కొంతవరకు నివారించవచ్చు. సాధారణంగా ఈ వ్యాధి నివారణకు 3 నుండి ఒక వారం కాలం వరకు సమయం ఔతుంది.

చత్వారం[మార్చు]

చత్వారం అంటే చూపు మందగించడం. సాధారణంగా ఇది 40 సంవత్సరాల నుండి ఆరంభం ఔతుందని విశ్వసిస్తున్నారు. అయినప్పటికీ ఇది కొందరిలో ముందుగానూ కొందరిలో ఆలస్యంగానూ ఆరంభం ఔతుంది. అక్షరాలు స్పష్టంగా కనిపించక పోవడం, చదవలేక పోవడం, చిన్న అక్షరాలు చదవలేక పోవడం, సూది వంటి సన్నని ద్వారం కనిపించపోవడం వంటి సమస్యలు ఉంటాయి. క్రమంగా ఇది అధికమౌతూ ఉంటుంది. నేత్ర వైద్యుని సంప్రదించి ఈ సమస్యను అధిగమించవచ్చు. సాధారణంగా కంటికి దూరదృష్టికి హశ్వదృష్టికీ అవసరమైన కంటి అద్దాలను ధరించడం ద్వారా అధిగమించవచ్చు.

  • ఒకప్పుడు కంటిలో లెన్స్ అమరచడం ద్వారా కూడా ఈ వ్యాధిని సరిచేసే వారు. ఈ లెంస్ కంటి గ్రుడ్డు మీద అమర్చబడతాయి.

వీటిని వెలుపలికి తీసి రూజూ శుభ్రపరచి తిరిగి ధరించాలి. రాత్రివేళ వీటిని తీసి వాటికి ప్రత్యేకించిన సొల్యూషన్‌లో భద్రరపరచాలి.

  • ఆధునిక వైద్యవిధానంలో కంటి అద్దాలు అవసరం లేకుండా కంటిలో లెన్స్ అమర్చడం ద్వారా సరి చేసుకోవచ్చు. ఇది అమర్చిన తరువాత కంటికి అద్దాలు ధరించవలసిన అవసరం లేదు. ఇవి కంటి పాప మీద శాశ్వత విధానంలో అమర్చబడతాయి. వీటిని అమర్చిన తరువాత ఇతర సమస్యలు లేనియడల ఇవి సుదీర్ఘకాలం పనిచేస్తాయి. ఈ లెమ్స్ ధరించినప్పటికీ మిగిలిన కంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది కనుక క్రమబద్ధమైన నేత్ర పరీక్షలు అవసరం.

శుక్లం[మార్చు]

గ్లాకోమా[మార్చు]

  • కంటిలో నీటి వత్తిడి అధికమైనప్పుడు కంటిలోని ఆఫ్టిక్ నరం దెబ్బ తింటుంది. ఇలా ఆఫ్టిక్ నరం దెబ్బతినడం గ్లాకోమా అని పిలువబడుతుంది.
  • ఇది చాలా కౄరమైన వ్యాధి. ఇది క్రమంగా పూర్తి అంధత్వం రావడానికి కారణం ఔతుంది.
  • 10-15 సంవత్సరాలు. 90% దెబ్బతింటుంది.
  • కంటి వత్తిడి 20 కంటే అధికమైనప్పుడు ఈ వ్యాధి ఉండడానికి అవకాశాలు అధికం. కంటి వత్తిడి పరిశోధించడం ద్వారా వ్యాధినిర్దారణ చేయవచ్చు.
  • ఇది వంశపరంపర్యంగా వస్తుంది. తల్లి తండ్రులకు ఈ వ్యాధి ఉన్నప్పుడు పిల్లలలో 5% మందికి ఈ వ్యాఫ్హిరావడానికి అవకాశం ఉంది. సోదరులు లేక సోదరీలకు ఈ వ్యాధి ఉన్నయడల 9% మందికి ఈ వ్యాధిరావడానికి అవకాశం ఉంది.
  • ప్రస్తుతం 4% మందికి గ్లాకోమా రావడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు.
  • చికిత్స ద్వార పోయిన దృష్టిని తిరిగి తీసుకురావడానికి వీలుకాదు. ఉన్నదృష్టిని మాత్రం కాపాడడానికి మాత్రమే అవకాశం ఉంది. దీనికి రాత్రివేళ మాత్రమే చుక్కల మందు వేయడంద్వారా సరిచేయవచ్చు. అలా చేయడానికి వీలుకాని యడల శస్త్రచికిత్స చేయవలసిన అవసరం ఉంది.
  • దీనికి చుక్కల మందుతో సరిచేయవచ్చు.


  • ప్రతివ్యక్తి ప్రతిసంవత్సరం కంటిని శోధించడం అవసరం. కార్నియా, రెటీనా, గ్లాకోమా, క్యాటరాక్ట్ వంటి సంపూర్ణ పరిశోధన అవసరం.
  • ఆకుకూర, క్యారెట్, పాలు వంటి ఎ విటమిన్ ఉన్న ఆహారం తీసుకోవాలి.

దూరదృష్టి[మార్చు]

హస్వదృష్టి[మార్చు]

..

కంటి పొర[మార్చు]

చూపు కొద్దిగా మందగిస్తుంది. అక్షరాలు మసగ్గా కనబడటం ప్రారంభిస్తాయి. మన కంట్లో ఒక కటకం (Lens) ఉంటుంది. అది ఒక సంచిలా ఉంటుంది. బయటి నుంచి వచ్చే కాంతి కిరణాలు ఈ కటకం ద్వారా వెళ్లి లోపల ఉండే రెటీనా మీద పడతాయి. అప్పుడే మనం దేన్నైయినా చూడగలుగుతాం. వయసు పైబడుతున్నప్పుడు కంట్లోని కండరాలు బిగుసుకుపోతాయి. కటకం తన సహజమైన మృదుత్వం కోల్పోయి గట్టిపడుతుంది. కటకానికి సంబంధించిన ప్రొటీన్లలో వచ్చిన కొన్ని రసాయనిక మార్పుల వల్ల కటకం మీద మచ్చలు ఏర్పడతాయి. ఈ స్థితినే శుక్లాలు (Cataract) అంటారు. ఈ శుక్లాల కారణంగా కిరణాలు లోనికి వెళ్లలేవు. ఫలితంగా చూపు మందగిస్తుంది. కొందరికి దగ్గరి చూపు మందగిస్తే మరికొందరిలో దూరం చూపు మందగించవచ్చు.

చికిత్స[మార్చు]

దీనిని శస్త్రచికిత్స ద్వారా మాత్రమే నివారించవచ్చు. ఒకప్పుడు ఈ చికిత్స చేయడానికి 10 మిల్లీమీటర్ల మేర కత్తిరించి శస్తచికిత్స చేసే వారు. ఆపరేషన్ సమయంలో కంటికి మత్తు ఇంజక్షన్ వేసే వారు. శస్త్రచికిత్స తరువాత కంటిమీద చిన్నపాటి తెరను ఉపయోగిస్తారు. దాదాపు ఒక మాసం కంటి మీద వెలుగు పడకుండా జాగ్రత్త పడడం అవసరం. కంటిలో సబ్బు, సీకాయ, నీరు వంటివి పడకూడదు కనుక సాధారణ స్నానం చేయడానికి కొన్న వారాలు వేచి ఉండాలి. తల స్నానం చేయడానికి మాసాల కాలం వేచి ఉండాలి. నిద్రించే సమయంలో ఒకే వైపు నిద్రించాలి, కఠినమైన పదార్థం తినకూడదు. వంటి జాగ్రత్తలు అవసరం.

ఆధునిక చికిత్స[మార్చు]

అయినప్పటికీ ఇప్పుడు ఆధునిక చికిత్స ద్వారా దీనిని ఇంజక్షన్ లేకుండా చుక్కల మందును ఉపయోగించడం ద్వారా శస్త్ర చికిత్స చేస్తున్నారు. ఈ చికిత్స కొరకు ఇప్పుడు 2.5 మాత్రం కత్తిరించి శస్త్ర చికిత్స చేయబడుతుంది. ఇది కంటి పాప మీద చేయబడుతుంది కనుక త్వరితగతిలో స్వస్థత చేకురడానికి అవకాశం ఉంది. ఈ చికిత్స తరుచాత కొన్ని గంటల సమయంలో పేషంటును ఇంటికి పంపుతారు. క్రమబద్ధమైన వైద్యపర్యవేక్షణ అవసరం. శస్త్రచికిత్స తరువాత దాదాపు రెండు మాసాల కాలం మందులు, మాత్రలు తీసుకోవడం అవసరం. ఇదికు విదేశాలనుండి దిగుమతి చేసుకున్న వైవిద్యమైన కటకం వాడుతుంటారు. కనుక శస్త్ర చికిత్స తరువాత కంటికి అద్దాలను ధరించడం ఒక విధానం అయితే మరొక విధానంలో అద్దాలు ధరించవలసిన అవసరం లేకుండా కూడా శస్త్రచికిత్స చేయబడుతుంది. ఈ చికిత్స చేయించుకున్న 3 రోజుల తరువాత వంటచేయడం, గుడ్డలు ఉతకడం, టి.వి చూడడం , పత్రిక చదవడం , మోటర్ బైకు, కారు వంటి వాహనాలను నడుపవచ్చు వంటి సాధాణ పనులు చేయవచ్చు. ఈ చికిత్స తరువాత రెండవ రోజు వైద్యపర్యవేక్షణ తరువాత ముఖం కడగడం, స్నానం వంటివి చేయవచ్చు.

అత్యాధునిక చికిత్స[మార్చు]

అత్యాధునికంగా ఈ చికిత్సలో 1 మి.మీ మాత్రమే కత్తిరించి చేయబడుతుంది. ఈ చికిత్సకు మత్తు ఇవ్వడానికి ఇంజక్షన్ కూడా అవసరం లేదు. కంటికి శస్త్రచికిత్సకు 48 గంటల ముందు నుండి చుక్కల మందును వాడిన తరువాత ఈ చికిత్స చేయబడుతుంది. కాని ఇలాంటి చికిత్స చేసే వైద్యులు చాలా అరుదుగా ఉన్నారు. 1 మి.మీ కత్యిరించడం ద్వారా త్వరితగతిలో నివారణ లభిస్తుంది.

పొరను తొలగించే మాగ్రాలు[మార్చు]

  • పొరను సరిచేయడానికి శస్త్రచికిత్స చేయడం ఒక్కటే మార్గం.
  • పొరను ముదరక ముందే ఆరంభ స్థాయిలో సరిచేయడం మంచిది. ఎందుకంటే ముదురిన తరువాత చేసే చికిత్స వలన ఉత్పన్నమయ్యే అధికమైన ఉష్ణం కారణంగా కంటికి హాని కలగడానికి అవకాశం ఉంది.
  • కంటిలోపల శస్త్రచికిత్స ద్వార అమర్చే కటకం (లెంస్) జీవితకాలం మన్నిక కలిగి ఉంటాయి.

చేపడుతున్న పరిశోధనలు[మార్చు]

  • మాత్ర, లేజర్, ఇజక్షన్ ద్వారా సరిచేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. అంతేకాక పొర రాకుండా చేయడానికి అవసరమైన మర్గాలను గురించి పరిశోధనలు జరుగుతున్నాయి.
  • లేజర్ ద్వారా తొలగించవచ్చు అని భావిస్తున్నప్పటికీ అవి ప్రయోగాత్మగ దశలో ఉన్నాయి. చికిత్సావిధాంలోకి ఇంకా రాలేదు.

చిన్న పిల్లలలో పొర రావడానికి కారణాలు[మార్చు]

  • మధుమేహం, గ్లాకోమా, మయోపియా, స్టెరాయిడ్స్ ఉపయోగించడం.

లాసిక్ సర్జరీ[మార్చు]

  • లాసిక్ సర్జరీ అంటే కళ్ళకు అద్దాలు లేకుండా ఉండడానికి చేయబడుతుంది. ఈ చికిత్సకు ముందు కార్నియాను పూర్యిగా పరిశీధనచేసిన తరువాత మాత్రమే చేయవలసిన అవసరం ఉంది.

ఆధునిక చికిత్సలో కంటికి తుల్యమైన దృష్టి లభించడానికి అవకాశంఉంది.

  • లాసిక్ సర్జరీ చేసిన తరువాత ముందు కంటికి గ్లార్ కొట్టడం, డ్రైవింగ్ చేయడం, కష్టం కావడం, కంప్యూటర్ చూడలేక పోవడం వంటి సమస్యలు ఉండేవి. కాని అత్యాధునికంగా చేసే చికిత్స ద్వారా అలాంటి సమస్యలు లేకుండా తుల్యంగా చూడడానికి వీలికల్పించేలా చేయడానికి వీలుకలుగుతుంది.

చికిత్సలో ఉపయోగించే కటకాలు (లెంస్)[మార్చు]

  • టారిక్ ఇంట్రాక్యులర్ లెన్స్ :- ఆస్టిక్ మాటిజం సరిచేయడానికి ఇది అవసరం.
  • మల్టీ ఫోకస్ లెంస్:- దూరదృష్టి హస్వదృష్టిని సరిచేసేవి. దీనివలన దూరంగా ఉండేవి, దగ్గరిగా ఉండేవి అయిన వస్తువులను తుల్యంగా చూడవచ్చు.
  • అబరేషన్ ఫ్రీ ఇంట్రాక్యులర్ లెన్స్ . మరింత తుల్యమైన దృష్టి కొరకు వీటిని అమర్చుతుంటారు.
  • గ్లూడ్ ఐ.ఒ.ఎల్ బయోలాజికల్ బంకతో లెన్స్ అతికించి కళ్ళజోడు లేకుండా చూడడానికి వసతి కల్పించబడుతుంది.

అంధత్వం[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]