నేపథ్య గాయకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీయ నేపథ్య గాయని లతా మంగేష్కర్ వేలాది పాటలను రికార్డ్ చేశారు

ఒక నేపథ్య గాయకుడు (ఆంగ్లం: Playback Singer) ఒక గాయకుడు, ఇతని గానం చలన చిత్రాలలో ఉపయోగించుకునేందుకు ముందుగా రికార్డు చేయబడుతుంది. సౌండ్ ట్రాక్స్ కోసం నేపథ్య గాయకుల పాటలు రికార్డ్ చేస్తారు, నటులు, నటీమణులు కెమెరా ముందు పాటలు తామే పాడుతున్నట్టు నటిస్తూ పెదవులు కదిలిస్తారు. అయితే వాస్తవ గాయకుడు తెరపై కనిపించడు. దక్షిణ ఆసియా చలన చిత్రాల నిర్మాణంలో ముఖ్యంగా భారత ఉపఖండంలో ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. అత్యధికంగా భారతీయ చలన చిత్రాలలో (ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్, ఇతర ప్రాంతీయ సినిమాలు), అలాగే పాకిస్తాన్ చిత్రాలలో సాధారణంగా ఆరు లేదా ఏడు పాటలు ఉంటాయి. మొదటి టాకీ చిత్రం అలమ్ అరా (1931) తరువాత అనేక సంవత్సరాలు గాయకులు ఒక చిత్రం కోసం రెండుసార్లు రికార్డిండ్ చేసేవారు. చిత్రీకరణ సమయంలో ఒకసారి, తరువాత మరొసారి రికార్డింగ్ స్టూడియోలో రికార్డింగ్ చేసేవారు. ఈ పద్ధతి 1952-53 వరకు కొనసాగింది.

పద ప్రయోగం

[మార్చు]
  • నేపథ్య గాయని లేక నేపథ్య గాయకురాలు - అని స్త్రీలను అంటారు
  • నేపథ్య గాయకుడు - అని పురుషులను అంటారు
  • నేపథ్య గాయకులు - అనే పదం బహువచనముగా, లేక స్త్రీ, పురుషుల ఇద్దరికి విడివిడిగా కూడా ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]