నేమాని దుర్గాప్రసాద్
నేమాని దుర్గాప్రసాద్ భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త. ఈయన 1986 లో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ లో పబ్లిక్ సర్వేస్ గ్రూప్ అఛీవ్‌మెంటు అవార్దు గ్రహీత. అమెరికన్ జియోఫిజిక్స్ యూనియన్ కు జీవితకాల సభ్యులుగా యున్నారు.అంతర్జాతీయ ఆశ్త్రోమిచల్ యూనియన్ లో కూడా సభ్యులు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన విజయవాడలో 1934 అక్టోబరు 11 న అన్నపూర్ణమ్మ వెంకటరామయ్య దంపతులకు జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం లో బి.ఎస్.సి (ఆనర్స్), బొంబాయి విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి, పి.హెచ్.డి పట్టాలను పొందారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చె(బొంబాయి) సంస్థలో ఫెలోషిప్ అందుకొని రీడరుగా (1955-1985) పనిచేసారు. అసోసియేట్ ప్రొఫెసరుగా 1964 నుండి 1967 వరకు పనిచేసారు. ప్రాజెక్టు సైంటిస్టుగా స్పేస్ లాబ్-3 ఎక్స్‌పరిమెంటు లో 1977 నుండి 8 సంవత్సరాలు పనిచేసి పలు నూతన అంశాలను అధ్యయనం చేసారు. వందకు పైగా పరిశోధనా పత్రాలను వెలువరించారు. అంతరిక్ష పరిశోధనా సదస్సులో సమర్పించిన పలు శాస్త్రవేత్తల పత్రాలను సదస్సుల కార్యకలాపాలను సమీక్షించారు[2].
అవార్డులు
[మార్చు]అమెరికన్ జియోఫిజికల్ యూనియన్, ఇంటర్నేషనల్ అస్ట్రానమిక్ యూనియన్ గౌరవ సభ్యత్వాన్ని అందుకున్నారు. అమెరికాలోని నాసా వారి పబ్లిక్ సర్వీసు గ్రూప్ అఛీవ్ మెంటు అవార్డు(1986) గ్రహీతగా ఘన కీర్తినార్జించారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ projile of nemani durga prasad[permanent dead link]
- ↑ 2.0 2.1 ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ ed.). శ్రీ వాసవ్య. 2011. p. 67.