Jump to content

నేరేళ్ళంక

Coordinates: 16°48′0.000″N 82°13′48.000″E / 16.80000000°N 82.23000000°E / 16.80000000; 82.23000000
వికీపీడియా నుండి
(నేరుళ్ళంక నుండి దారిమార్పు చెందింది)
నేరేళ్ళంక
గ్రామం
పటం
నేరేళ్ళంక is located in ఆంధ్రప్రదేశ్
నేరేళ్ళంక
నేరేళ్ళంక
అక్షాంశ రేఖాంశాలు: 16°48′0.000″N 82°13′48.000″E / 16.80000000°N 82.23000000°E / 16.80000000; 82.23000000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ
మండలంతాళ్ళరేవు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్533263

నేరుళ్ళంక కాకినాడ జిల్లా, తాళ్లరేవు మండలానికి చెందిన గ్రామం.[1][2] ఈ గ్రామం మరో 3 గ్రామాల సమూహము, సుమారుగా ఏడువందల కుటుంబాలు ఉన్నాయి.

ఈ గ్రామంలో పోతురాజు దేవత జాతర ప్రతియేటా జరుగుతుంది, ఈ గ్రామంలో కేవలం దళిత, సెట్టిబలిజ కులాలకు సంబంధించిన వారు మాత్రమే ఉన్నారు.ఈ గ్రామానికి సరైన ప్రయాణ వసతులు లేవు, గ్రామానికి ఎటువైపు నుండి చేరుకోవాలన్న కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది. కాలినడకన చేరుకోవాలంటే కనీసం మూడు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆసుపత్రి, పాఠశాల లాంటి కనీస సదుపాయాలూ లేని ఈ గ్రామానికి యానాం పట్టణం నుండి రామచంద్రాపురం వెళ్ళే బస్సులలో ప్రయాణించి, కోలంక గ్రామంలో దిగి నడచి వెళ్ళాల్సి ఉంటుంది . కవి సంగమంలో రాస్తూ అందరి మన్ననలూ పొందుతున్నయువతరం కవి కాశిరాజు ఈ నేరుడులంక గ్రామానికి చెందినవారే.

గ్రామ ప్రముఖులు

[మార్చు]
కాశి రాజు - వర్థమాన కవులలో కాశి రాజు ఒకరు.
  • కాశి రాజు - వర్థమాన కవులలో కాశి రాజు ఒకరు. ఇతని పూర్తిపేరు వీర వెంకట సత్య గోవింద రాజు. కవి సంగమంలో గ్రూప్ కవితలు రాస్తున్నారు.కాశి రాజు 1988, అక్టోబర్ 3 న సత్యనారాయణ, శాంతమ్మ దంపతులకు నేరేళ్ళంకలో జన్మించారు.

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.
  2. నేరుళ్ళంక ఉనికి

వెలుపలి లంకెలు

[మార్చు]