నేల బండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేల-బండ గ్రామీణ ప్రాంతాలలో వీధి పిల్లలు ఆడుకొనే ఆట. ఈ ఆటను హిందీలో "ఊంచ్ నీచ్" అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆటను ఉత్తర భారతదేశంలో, పాకిస్తాన్ లో కూడా ఆడుతారు.

ఆట విశేషాలు[మార్చు]

ఈ ఆట ముఖ్యంగా 6 నుండి 13 వరకు వయసు గల బాల బాలికలు ఆడు ఆట. ఈ ఆటను ఎంతమందయినా ఆడవచ్చును. మొదటగా పంటలు వేసుకుని ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. ఈ ఆట ఆడేచోట మట్టి ప్రదేశం (నేల), రాతి ప్రదేశం (బండ) ఉండాలి. ముందుగా దొంగని నేల కావాలో బండ కావాలో కోరుకోమంటారు. ఉదాహరణకి దొంగ నేల కోరుకున్నచో, దొంగ నేల మీద, మిగిలిన వారందరు బండ మీద ఉంటారు. బండ మీద ఉన్నవారు నేల మీదకి వచ్చి దొంగని ఆటపట్టిస్తూ ఉంటారు. దొంగ బండ మీదకి వెళ్లకుండా నేల మీదకి వచ్చిన వాళ్లని పట్టుకోవటానికి ప్రయత్నించాలి. ఇదే దొంగ ముఖ్య లక్ష్యం. దొంగకి చిక్కిన వారు దొంగ అవుతారు. కొత్త దొంగతో మళ్ళీ ఆట మొదలౌతుంది. [1] ఈ ఆట చిన్న పిల్లలకు బాగా ఇష్టమైన ఆట. ఆటలో ఆటగాళ్ళు పట్టుకొనే వాడిని "హం తుమ్హారీ నేచ్ పె లేదా హం తుమ్హారీ ఊంచ్ పె" అని ఆట పట్టిస్తుంటారు. అనగా తెలుగులో "నీ నేలంట పప్పు సుద్ద" లేదా "నే బండంట పప్పు సుద్ద" అని అర్థం. [2][3]

ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఆట ఉత్తర భారత దేశ ప్రభావంతో ఆడుతున్నారు. ఈ ఆటాలో నలుగురు గానీ అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు పాల్గొంటారు. ఈ ఆటను ఫుట్ పాత్ ను బండగానూ, దిగువ భాగం నేలగానూ తీసుకుని ఆడుతుంటారు. కొన్ని ప్రాంతాలలో నేలకు ఎత్తుగా ఉన్న భూమిని బండగానూ, దిగువ భాగం నేలగానూ భావించి ఈ ఆటను ఆడుతుంటారు.

మహారాష్ట్రలో ఈ ఆటను "దగాడ్ కా మాటీ" అనే ఆటగా ఆడతారు. దీని అర్థం "రాయి లేదా ఇసుక"

మూలాలు[మార్చు]

  1. "హుషారునిచ్చే పాత ఆటలు | మానవి | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2022-07-15. Retrieved 2022-07-15.
  2. "Oonch Neech". Archived from the original on 2010-01-06. Retrieved 2021-04-22.
  3. "Traditional Games in Pakistan".

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నేల_బండ&oldid=3600114" నుండి వెలికితీశారు