Jump to content

నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ

వికీపీడియా నుండి
నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ

నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ (NSTL) విశాఖపట్నంలో, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) స్థాపించిన రక్షణ ప్రయోగశాల. నీటి అడుగున పనిచేసే ఆయుధాలు, అనుబంధ వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధి చెయ్యడం దీని ప్రధాన విధి. డిఆర్‌డివో లోని డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ ఆర్ అండ్ డి, NSTL ను నిర్వహిస్తుంది. NSTL ప్రస్తుత డైరెక్టర్ డా. అబ్రహం వర్ఘీస్, డైరెక్టర్ జనరల్ (DG) డాక్టర్ వై. శ్రీనివాసరావు.[1]

చరిత్ర

[మార్చు]

NSTL ను 1969 ఆగస్టు 20 న భారత నావికాదళాన్ని స్వావలంబనగా మార్చే ఉద్దేశంతో ప్రధాన నౌకాదళ వ్యవస్థలు, నీటి అడుగున ఆయుధాల పరిశోధన, అభివృద్ధిని చేపట్టేందుకు స్థాపించారు.

పని ప్రాంతాలు

[మార్చు]

NSTL నీటి అడుగున పనిచేసే ఆయుధాలు, వాటి నియంత్రణ వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, పరీక్ష, మూల్యాంకనం, ఉత్పత్తి చేస్తుంది. వీటిలో టార్పెడోలు, గనులు, డికాయ్‌లు, టార్గెట్‌లు, సిమ్యులేటర్‌లు, ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌లు, ఆయుధ లాంచర్లు ఉన్నాయి.

ఈ ల్యాబ్ హైడ్రోడైనమిక్ పారామితులను పరిశోధించడం, ఉపరితల సముద్రగర్భ నౌకాదళ ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణ రూపకల్పన, మోడల్ అధ్యయనాలు, అనుకరణల ద్వారా డిజైన్ ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో పాల్గొంటుంది. NSTL యుద్ధనౌక సాంకేతికతలు, నౌకల కోసం స్టీల్త్ టెక్నాలజీ, హైడ్రో-డైనమిక్ పరిశోధన సేవలను అభివృద్ధి చేయడంలో కూడా పాలుపంచుకుంది.

NSTL మెరైన్ అప్లికేషన్‌ల కోసం ప్రత్యేకమైన మెటీరియల్‌లను కూడా అభివృద్ధి చేస్తుంది. ఇందులో రాడార్, IR, మాగ్నెటిక్, ఎకౌస్టిక్, ELFE సిగ్నేచర్‌లను తగ్గించే మెటీరియల్‌లు కూడా ఉన్నాయి.

సౌకర్యాలు

[మార్చు]

NSTL లో ప్రయోగశాలలు, హైడ్రోడైనమిక్ పరిశోధన సౌకర్యాలు ఉన్నాయి.

ప్రాజెక్టులు, ఉత్పత్తులు

[మార్చు]
  • మారిచ్ ATDS
  • స్వయంప్రతిపత్త నీటి అడుగున వాహనం

మూలాలు

[మార్చు]