Jump to content

నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ

అక్షాంశ రేఖాంశాలు: 18°32′30″N 73°48′38″E / 18.541598°N 73.81065°E / 18.541598; 73.81065
వికీపీడియా నుండి
నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ (NCL)
राष्ट्रीय रासायनिक प्रयोगशाला
స్థాపన1950 (1950)
పరిశోధనా రంగం
కెమికల్ సైన్స్
డైరెక్టరుఆశిష్ కిషోర్ లేలే
సిబ్బంది≈200 (పిహెచ్‌డి)
విద్యార్థులు400 డాక్టరల్
చిరునామాపాషన్ రోడ్
స్థలంపుణె, మహారాష్ట్ర, భారతదేశం
18°32′30″N 73°48′38″E / 18.541598°N 73.81065°E / 18.541598; 73.81065
411008
క్యాంపస్పట్టణ ప్రాంతం
యాజమాన్య సంస్థ
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్

నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ (ఆంగ్లం: National Chemical Laboratory) అనేది పశ్చిమ భారతదేశంలోని పూణేలో ఉన్న ఒక భారత ప్రభుత్వ ప్రయోగశాల.

1950లో స్థాపించబడిన ఈ జాతీయ రసాయనిక పరిశోధనాశాల, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఇండియాలో సభ్యత్వానికి ప్రసిద్ధి చెందింది. 2021 ఏప్రిల్ 1న బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఆశిష్ లేలే దీనికి ప్రస్తుతం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.[1] ఇక్కడ దాదాపు 200 మంది సైంటిఫిక్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ సెంటర్ విస్తృత పరిశోధన పరిధిని కలిగి ఉంది. పాలిమర్ సైన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, క్యాటాలిసిస్, మెటీరియల్స్ కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, బయోకెమికల్ సైన్సెస్, ప్రాసెస్ డెవలప్‌మెంట్‌లో ప్రత్యేకత కలిగి ఉంది. మెజర్మెంట్ సైన్స్, కెమికల్ ఇన్ఫర్మేషన్ లలో మంచి మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి.

నేషనల్ కలెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ మైక్రోఆర్గానిజమ్స్ (NCIM) ఇక్కడ ఉంది.[2] ఇది పారిశ్రామికంగా ముఖ్యమైన మైక్రోబియల్ కల్చర్ స్టాక్‌ను నిర్వహించే మైక్రోబియల్ కల్చర్ రిపోజిటరీ.

పరిశోధనా బృందాలు

[మార్చు]
  • ఫిజికల్ & మెటీరియల్స్ కెమిస్ట్రీ
  • క్యాటలిసిస్ & ఇనార్గానిక్ కెమిస్ట్రీ
  • కెమికల్ బయాలజీ & బయోమెటిక్ కెమిస్ట్రీ
  • కెమికల్ ఇంజనీరింగ్ సైన్స్
  • కాంప్లెక్స్ ఫ్లూయిడిక్స్ & పాలిమర్ ఇంజనీరింగ్
  • హెటిరోజీనియస్ & హోమోజీనియస్ క్యాటలిసిస్
  • ఇండస్ట్రియల్ ఫ్లో మోడలింగ్
  • మెటీరియల్స్ కెమిస్ట్రీ
  • నానో మెటీరియల్స్ సైన్స్ & టెక్నాలజీ
  • ఆర్గానిక్ కెమిస్ట్రీ
  • ప్లాంట్ టిష్యూ కల్చర్
  • పాలిమర్ కెమిస్ట్రీ & మెటీరియల్స్
  • ప్రాసెస్ డిజైన్ & డెవలప్మెంట్
  • థియరీ & కంప్యూటేషనల్ సైన్సెస్
  • ఎంజైమాలజీ & మైక్రోబయాలజీ
  • పాలిమర్ సైన్స్ & ఇంజనీరింగ్
  • డిజిటల్ ఇన్ఫర్మేషన్ & రిసోర్స్ సెంటర్

సౌకర్యాలు

[మార్చు]

ఆధునిక ఆంగ్ల పాఠశాల

[మార్చు]

నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ ప్రాంగణంలో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. 1985లో స్కూల్‌గా స్థాపించబడి ఆ తర్వాత 'ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ సొసైటీస్ మోడ్రన్ ఇంగ్లీష్ స్కూల్'గా పేరు మార్చబడింది. 2006 నుండి జూనియర్ కళాశాలను కూడా ప్రారంభించారు.

డిస్పెన్సరీ

[మార్చు]

ఎన్.సి.ఎల్ ప్రాంగణంలో ఒక డిస్పెన్సరీ ఉంది. ఇందులో ఎన్.సి.ఎల్ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) వర్తించే వారికి కూడా ఉచితంగా వైద్య సహాయం అందిస్తారు.

గతంలోని డైరెక్టర్లు

[మార్చు]

నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ ప్రారంభం నుండి చాలా మంది ప్రముఖ శాస్త్రవేత్తల నేతృత్వంలో నడుస్తోంది.[3]

  1. జేమ్స్ విలియం మెక్‌బైన్ (1950-1952)
  2. జార్జ్ ఇంగిల్ ఫించ్ (1952-1957)
  3. కృష్ణసామి వెంకటరామన్ (1957-1966)
  4. బాల దత్తాత్రేయ తిలక్ (1966-1978)
  5. ఎల్. కె. దొరైస్వామి (1978-1989)
  6. రఘునాథ్ అనంత్ మషేల్కర్ (1989-1995)
  7. పాల్ రత్నసామి (1995-2002)
  8. స్వామినాథన్ శివరామ్ (2002-2010)
  9. సౌరవ్ పాల్ (2010-2015)
  10. కె. విజయమోహనన్ పిళ్లై (2015-2016)
  11. అశ్విని నంగియా (2016-2020)
  12. ఎస్.చంద్రశేఖర్ (2020-2021)

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Dr Asish Lele takes charge as director of CSIR – National Chemical Laboratory". The Indian Express (in ఇంగ్లీష్). 2021-04-01. Retrieved 2021-04-24.
  2. "National Collection of Industrial Microorganisms" (in ఇంగ్లీష్). Retrieved 2022-02-24.
  3. "NCL Previous Directors". National Chemical Laboratory. 2016. Retrieved 12 May 2016.