నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులను సెకండరీ స్థాయిలో వారి యొక్క విద్యను ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ అమలుపరిచేటటువంటి పథకం[1].8వ తరగతిలో చదువు మానేసి వారిని ప్రోత్సహించే లక్ష్యంతో 2008లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 8వ తరగతిలో విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతిభా అన్వేషణ పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఈ స్కాలర్షిప్ పథకం వర్తిస్తుంది[2].ఈ పథకం ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరం 12 వేల రూపాయలను కేంద్రప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. 2017 వరకు కేవలం సంవత్సరానికి 6000 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అందజేసేది. స్థానిక, జిల్లా, ఎయిడెడ్, వసతి గృహాలలో లేకుండా విద్యనభ్యసించే విద్యార్థులకు మాత్రమే ఈ పథకానికి అర్హులు[3]. ఈ పథకం ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ద్వారా నోటిఫికేషన్ వెలువడుతుంది.ఇందులో ఎంపిక చేయబడిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం వారి యొక్క నగదును నేషనల్ ఫైనాన్సు మేనేజ్మెంట్ సిస్టం ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా విద్యార్థులకు వారి యొక్క బ్యాంకు ఖాతాలకి ప్రత్యక్షంగా నగదు బదిలీ చేయడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యార్థుల యొక్క ఉన్నత చదువులకు ఉపయోగపడేందుకు ప్రవేశపెట్టినటువంటి గొప్ప పథకం.

మూలాలు[మార్చు]

  1. "National Means-cum-merit Scholarship Scheme | Ministry of Education, GoI". dsel.education.gov.in. Retrieved 2023-08-24.
  2. "PFMS National Means Cum Merit Scheme". pfms.nic.in. Retrieved 2023-08-24.
  3. SS_writings (2021-07-01). "పాఠశాల విద్యార్థులకు మంచి స్కాలర్ షిప్స్.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి..!". Manalokam (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-24.