నోటి వ్యాధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నోటి అనాటమీ

లక్షణాలు

[మార్చు]

నాలుక బాగా ఎర్రగా వుండడం. కొందరిలో తెల్లగా గుంత పడినట్టు పుండు, దాని చుట్టూ ఎర్రగా కనిపించడం. కొద్దిగా కూడా వేడి పదార్థాలు తినలేకపోవడం. కారం, మసాల దినుసులు తినలేక పోవడం. పంటి నొప్పి, నోట్లో నీరు ఊరునట్టుండడం.

చికిత్స

[మార్చు]

విటమిన్లు, పోషకపదార్థాలు సరిగ్గా లేక నీరసించి వున్నవాళ్ళు బి-కాంప్లెక్స్‌ (నియాసిన్‌, ఫోలిక్‌ ఆమ్లం, రిబోఫ్లేవిన్‌ బి12 జింకు, ఐరన్‌ కలిగిన) మాత్రలు వాడాలి. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వుంటే మెట్రోనిడియోజాల్‌ 200 మిల్లీగ్రాములు రోజుకు మూడేసి, ఫంగస్‌ వుంటే నిస్టాంటిన్‌ లాజెంజెస్‌, క్యాడిడ్‌ లోషన్‌ లేక జెల్లి అంటించాలి. నోటిని పరిశుభ్రతగా వుంచాలి. చిగుళ్ళ వ్యాధికి తగు చికిత్స చేయించాలి. క్లోర్‌హెక్సిడిన్‌ మౌత్‌ పెయింటు వాడాలి. మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. మలబద్దకం లేకుండా చూసుకోవాలి. ఆందోళనను నియంత్రించుకొని ప్రశాంత జీవన శైలి అలవర్చుకోవాలి. జీర్ణాశయప్రక్రియ సరిగ్గా వుండేట్టు చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం మానాలి. కిళ్లీ, జర్దా, పాన్‌ పరాగ్‌ వాడకం మానాలి. అవసరాన్ని బట్టి హైడ్రోకార్టిజోన్‌ లాజెంజెస్‌ గాని, బిళ్లలుగాని డాక్టరు సలహా మేరకు కొద్ది రోజులే వాడాలి. కొన్ని వ్యాధులు (ఎయిడ్స్‌, మధుమేహం వంటివి) కొన్ని మందుల వల్ల కల్గితే, రక్తంలో దోషముంటే వాటికి తగిన చికిత్స చేయించాలి.