నోరి గోపాలకృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నోరి గోపాలకృష్ణమూర్తి అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న ప్రఖ్యాత ఇంజనీరు. సివిల్ ఇంజనీరింగులో ఇతని సేవలను గుర్తించిన భారతప్రభుత్వం 1963లో పద్మశ్రీ పురస్కారం, 1972లో పద్మభూషణ పురస్కారాలను ఇచ్చి సత్కరించింది.

బాల్యము, విద్యాభ్యాసము[మార్చు]

నోరి గోపాలకృష్ణమూర్తి 1910, ఫిబ్రవరి 16వ తేదీన గుంటూరు జిల్లా, బాపట్ల పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు నోరి వేంకటేశ్వరులు మరియు తల్లి పేరు సుందరమ్మ. ఇతని ప్రాథమిక విద్యను బాపట్ల బోర్డు స్కూలులో చదివి 1924లో ఎస్.ఎస్.ఎల్.సి పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. 1930లో మద్రాసులోని గిండీ ఇంజనీరింగు కళాశాలనుండి ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్నాడు[1].

ఉద్యోగం[మార్చు]

ఇతడు 1931లో అఖిలభారత పోటీ పరీక్షలలో ఉత్తీర్ణుడై, ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసులో చేరాడు. బాంబే మెట్రో పాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ చైర్మన్‌గా, భారత ప్రభుత్వ వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉధ్యోగబాధ్యతలు నిర్వహించాడు.1979లో పదవీవిరమణ చేసిన తరువాత కన్సల్టెంట్‌గా దేశంలోని అనేక సాగునీటి, విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు సహాయ సహకారాలను అందించాడు.

ఉద్యోగ విజయాలు[మార్చు]

ఇతడు మహారాష్ట్రలోని కొయినా డ్యాంకు రూపకల్పన చేశాడు. భాక్రానంగల్‌ డ్యాం మేనేజ్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించాడు. ఈ రెండు డ్యాములను అత్యధ్భుతంగా తీర్చిదిద్దడంలో ఇతని కృషి ఉంది. ఇతడు రెండవ ప్రపంచ యుద్ద కాలంలో పూనా, బెల్గాం విమానశ్రయాలకు లోనోవాలాలో నావల్‌ ఇంజనీరింగ్‌ సెంటర్‌కు రూపకల్పన చేశాడు. ఇతడు ఇంకా ప్రపంచ భారీ డ్యాముల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా, ఇండో బంగ్లాదేశ్‌ జాయింట్‌ రివర్‌ కమిషన్‌ అధ్యక్షుడిగా సేవలను అందించాడు. ఇతడు సివిల్‌ ఇంజనీరింగ్‌ రంగంలో ఎన్నో పరిశోధనా పత్రాలను వివిధ సదస్సులలో సమర్పించాడు.

కుటుంబం[మార్చు]

ఇతని భార్యపేరు సుందరరామరత్నం. ఇతని కుమారులు నోరి పాండురంగ విఠల్, నోరి వాసుదేవ్ ఇద్దరూ సివిల్ ఇంజనీర్లుగా రాణించారు. నోరి పాండురంగ విఠల్ ఛీఫ్ రైల్వే సేఫ్టీ కమీషనర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు[2].

పురస్కారాలు[మార్చు]

మరణం[మార్చు]

ఇతడు ముంబాయిలో 1995, ఫిబ్రవరి 25వ తేదీన మరణించాడు. ఇతని జ్ఞాపకార్థం బాపట్ల పట్టణంలోని పటేల్‌నగర్‌లో 2015లో ఇతని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

మూలాలు[మార్చు]