Jump to content

ధూమపాన రహిత దినోత్సవం

వికీపీడియా నుండి
(నో స్మోకింగ్ డే నుండి దారిమార్పు చెందింది)
"పొగ త్రాగరాదు" అని తెలియజేసే గుర్తు

పొగతాగని రోజు లేదా ధూమపానక రహిత దినం యునైటెడ్ కింగ్‌డమ్‌లో వార్షిక ఆరోగ్య అవగాహన దినం. ధూమపానం మానేయాలనుకునే వారికి సహాయం చేయడానికి దీన్ని ఉద్దేశించారు. మొట్టమొదటి ధూమపాన రహిత దినం 1984 లో యాష్ బుధవారం నాడు పెట్టారు. [1][2] ఇది ఇప్పుడు మార్చిలో రెండవ బుధవారం నాడు ఇది జరుగుతుంది.

జరిపే విధం

[మార్చు]

1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సమావేశంలో 1988, ఏప్రిల్ 7న ధూమపాన రహిత దినోత్సవంగా పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగదారులను ఏప్రిల్ 7వ తేదీన 24 గంటలపాటు పొగాకు ఉత్పత్తులను వాడకుండా ఉండమని కోరింది.[3] దానిని అనుసరించి 1988లో జరిగిన సమావేశంలో ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది.

ఏటా ఒక చిన్న పదబంధం రూపంలో ఒక థీమ్‌తో ప్రచారం చేస్తారు. 2010 లో, ఈ థీమ్ "బ్రేక్ ఫ్రీ". ధూమపానం చేసేవారిని సిగరెట్ల శృంఖలాల నుండి విముక్తి పొందమని ప్రోత్సహిస్తుంది. 2011 థీమ్ "వదిలేసే సమయమొచ్చిందా?" 2009 ప్రచారం తరువాత జిఎఫ్‌కె ఎన్‌ఓపి నిర్వహించిన పరిశోధనలో పొగతాగని రోజున 10 మందిలో ఒకరు ధూమపానం మానేస్తున్నారని తేలింది.

ఈ ప్రచారాన్ని అదే పేరుతో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతోంది. 2011 లో బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌లో విలీనం చేసే వరకు నలుగురు పూర్తికాల సిబ్బందితో లండన్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేసేది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న ప్రభుత్వ, స్వచ్ఛంద రంగ సంస్థల కూటమి దీనికి నిధులు సమకూరుస్తుంది. నో స్మోకింగ్ డే ఇటీవలి అధ్యక్షుడు వ్యవస్థాపకుడు, టీవీ వ్యాఖ్యాత, పొగాకు వ్యతిరేక ప్రచారకుడు డంకన్ బన్నటిన్. బన్నటిన్ ఒకప్పుడు పొగతాగేవాడు. 2008 ఏప్రిల్ లో బ్రిటిష్ అమెరికన్ పొగాకు కంపెనీపై దాని AGM లోనే బహిరంగంగా ఢీకొన్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "National No Smoking Day - National Awareness Days Calendar & Download 2017". Archived from the original on 2017-04-15. Retrieved 14 April 2017. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "No Smoking Day". Retrieved 14 April 2017.
  3. Centres for Disease Control. 1990. ″MMWR Weekly″ (6 April 1990). World No-Tobacco Day. Archived 25 జూన్ 2017 at the Wayback Machine Atlanta.