న్యాయం (నాటకం)
స్వరూపం
న్యాయం | |
న్యాయం పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | సోమంచి యజ్ఞన్న శాస్త్రి, (మూల నాటకం: జస్టిస్, రచన: జాన్ గాల్స్‌వర్దీ) |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నాటకం |
ప్రచురణ: | అద్దేపల్లి అండ్ కో, సరస్వతి పవర్ ప్రెస్, రాజమహేంద్రవరం |
విడుదల: | 1955 |
పేజీలు: | 84 |
న్యాయం 1955లో వచ్చిన తెలుగు నాటకం. ఇంగ్లీష్ నాటక రచయిత జాన్ గాల్స్‌వర్దీ 1910లో రాసిన జస్టిస్ అనే నాలుగంకాల నాటకాన్ని సోమంచి యజ్ఞన్న శాస్త్రి అనుసృజన (అనువాదం) చేశాడు.[1]
కథానేపథ్యం
[మార్చు]ఖైదీల జీవన స్థితిగతుల ఇతివృత్తంగా రాసిన ఈ నాటకానికి జైళ్ళ సంస్కరణల చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది.
పాత్రలు
[మార్చు]ఈ నాటకంలోని పాత్రలు:[2]
- రాఘవయ్య (ఫ్లీడరు)
- రాజారావు (ఫ్లీడరు కొడుకు-కొత్త ఫ్లీడరు)
- రామయ్య (ఫ్లీడరు పెద్ద గుమస్తా)
- మోహనరావు (ఫ్లీడరు మూడో గుమస్తా)
- వెంకడు (ఖైదీ)
- సుందరమ్మ (మోహనరావు ప్రియురాలు)
- ఇద్దరు ఫ్లీడర్లు
- న్యాయమూర్తి
- కోర్టు గుమాస్తా
- కోర్టు బంట్రోతు
- జూరీ మనుషులు
- జైలు సూపరెండెంట్
- హెడ్ వార్డెన్
- ఇద్దరు డాక్టర్లు
ఇతర వివరాలు
[మార్చు]- అద్దేపల్లి నాగేశ్వరరావు ఈ పుస్తకాన్ని ఉచితంగా ముద్రించారు.
- నాటకం ప్రదర్శించినవాళ్ళు ఐదు రూపాయలను ముంబైలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలకు అందించాలని సూచించారు.[3]