సోమంచి యజ్ఞన్న శాస్త్రి
స్వరూపం
సోమంచి యజ్ఞన్న శాస్త్రి | |
---|---|
జననం | 1913, నవంబరు 3 ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
ప్రసిద్ధి | తెలుగు కథ, నవల, నాటక రచయిత |
తండ్రి | సీతారామయ్య |
తల్లి | వరలక్ష్మీ |
సోమంచి యజ్ఞన్న శాస్త్రి తెలుగు కథ, నవల, నాటక రచయిత. బొంబాయి ఆంధ్ర మహాసభ నిర్వహణలో ముఖ్యపాత్ర వహించాడు.[1]
జననం - ఉద్యోగం
[మార్చు]యజ్ఞన్న శాస్త్రి 1913, నవంబరు 3న సీతారామయ్య, వరలక్ష్మీ దంపతులకు పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరులో జన్మించాడు. ముంబాయి నగర మునిసిపల్ కార్పోరేషన్ డిప్యూటీ కమిషనరుగా పనిచేశాడు.
సాహిత్యరంగం
[మార్చు]శాస్త్రి రచించిన కథలు, వ్యాసాలు ఇంగ్లీషులోకి అనువాదం చేయబడి ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో ప్రచురించబడ్డాయి.[2]
నాటకరంగంలో స్థితిగతుల గురించి, ప్రదర్శనలో జరిగే లోపాల గురించి, నటీనటుల వల్ల నాటక ప్రదర్శన సరిగా రాకపోవడం గురించి వివరించే నాటికలు ఎక్కువగా రాశాడు. భమిడిపాటి కామేశ్వరరావు రచన స్ఫూర్తితో యజ్ఞన్నశాస్త్రి కూడా హాస్య రచనలు చేశాడు. ఈ హస్య నాటికలు మాత్రమే ప్రదర్శన చేయబడ్డాయి.[3]
రచించినవి
[మార్చు]నాటకాలు
- కళ్యాణి (1947)- మాటర్ లింక్ రాసిన మోననావా
- మహానుభావులు (1957) - గోగోల్ రాసిన ఇన్స్పెక్టర్ జనరల్ (1936)
- న్యాయం - గాల్స్ వర్డీ రాసిన జస్టీస్ (1910)
- విశ్వం పెళ్లి (1949) - బెర్నార్డ్ షా మాన్ అండ్ సూపర్ మాన్ (1930)
- పాపం సోకని పతనం (1970) - ప్లాటస్ రాసిన ఆంఫిట్రియోన్
- యమునా తీరే ఎవరికి వారే (1954)
- పెద్దమనుషులు (1954)
- మాయ నొప్పులు (1955)
- పేరయ్య రాజంట
- రంగ భూమి
- ఓ మనిషి నూతిలో పడితే
- ఈ సంసారం
- లోకులు కాకులు
- రిహార్సలు
- ప్రదర్శనము
- ఆంధ్రనాటకరంగానికి జై
- వస్తుందండి రాష్ట్రం రాకేం జేస్తుంది
- కట్నం కోరని కళ్యాణం
- కాలక్షేపానికి
కథలు
- లంచం పట్టిన ఆఫీసరు
- లాభం చేసిన గొల్లది
- సంఘం కోసం చందాలు[4]
పురస్కారాలు
[మార్చు]- ఉత్తమ నాటక రచయితగా కీర్తి పురస్కారం - కీర్తి పురస్కారాలు (1992), తెలుగు విశ్వవిద్యాలయం, 1992.[5]
ఇతర వివరాలు
[మార్చు]- ముంబైలో ఆంధ్రమహాసభ కార్యవర్గ సభ్యుడుగా, విద్యాసంఘ సభ్యుడుగా బాధ్యతలు నిర్వర్తించాడు.
- లఖ్‌నవూలో జరిగిన అభ్యుదయ రచయితల సమావేశానికి అబ్బూరి రామకృష్ణారావుతో కలిసి పాల్గొన్నాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, ఇతర రాష్ట్రాలు (28 February 2014). "త్రిముఖ పోటీ!". Sakshi. Archived from the original on 4 ఏప్రిల్ 2020. Retrieved 4 April 2020.
- ↑ సోమంచి యజ్ఞన్న శాస్త్రి, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 471.
- ↑ శ్రీ సోమంచి యజ్ఞన్న శాస్త్రి, తెలుగు నాటక వెలుగులు, గండవరం సుబ్బరామిరెడ్డి, ధరణి ప్రింటర్స్ హైదరాబాదు, డిసెంబరు 2016, పుట. 215.
- ↑ విశాలాంధ్ర, సాహిత్యం (28 October 2012). "ధీరోదాత్తతకన్నా ధీరోద్ధత పాత్రలకే పాచుర్యం". Retrieved 4 April 2020.[permanent dead link]
- ↑ తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "కీర్తి పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 9 సెప్టెంబరు 2017. Retrieved 4 April 2020.
- ↑ తెలుగు వెలుగు, వ్యాసాలు (2 December 2019). "అభ్యుదయ కామన... సాహితీ చేతన". www.teluguvelugu.in. ఆర్వీ రామారావ్. Archived from the original on 4 ఏప్రిల్ 2020. Retrieved 4 April 2020.