మహానుభావులు (నాటకం)
Jump to navigation
Jump to search
మహానుభావులు | |
మహానుభావులు పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | సోమంచి యజ్ఞన్న శాస్త్రి, (మూల నాటకం: రెవిజోర్, రచన: నికోలాయ్ గోగోల్) |
---|---|
సంపాదకులు: | బొందలపాటి శకుంతలాదేవి, శివరామకృష్ణ |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నాటకం |
ప్రచురణ: | దేశి కవితామండలి, దేశి ప్రెస్, విజయవాడ |
విడుదల: | మే 1957 |
పేజీలు: | 114 |
మహానుభావులు 1957లో వచ్చిన తెలుగు సాంఘీక నాటకం.[1] రష్యన్ నాటక రచయిత నికోలాయ్ గోగోల్ 1836లో రాసిన రెవిజోర్ (ఇన్‌స్పెక్టర్ జనరల్) నాటకాన్ని సోమంచి యజ్ఞన్న శాస్త్రి అనుసృజన (అనువాదం) చేశాడు. జారుల కాలంలో రష్యన్ కులీనుల్లో పెరిగిన స్వార్థబుద్ధీ, మౌఢ్యం, రాజకీయ అవినీతీ, అక్రమాలను అవహేళన చెయ్యడంకోసం రాసిన ఈ నాటకం రష్యన్ సాహిత్య చరిత్రలో ముఖ్యపాత్ర పోషించింది.
పాత్రలు
[మార్చు]ఈ నాటకంలోని పాత్రలు:[2]
- రాఘవేంద్రరావు: దివాన్జీ-జిల్లా ఆఫీసరు
- చంద్రిక: ఆయన రెండవ భార్య
- కవిత: ఆయన మొదటి భార్య కూతురు
- నాయుడు: జడ్జీ
- డాక్టరు చంద్రశేఖర్: జిల్లా మెడికల్ అఫీసరు
- ఆచార్లు: హెడ్ మాస్టర్
- వెంకప్ప వంతులు: పోస్టుమాస్టరు
- రామచంద్రయ్య: చిన్న ఉద్యోగం
- రుద్రయ్య: ధర్మకర్త
- భద్రయ్య: పురోహితుడు
- సరసన్న: నౌకరు
- లక్ష్మణస్వామి: హోటల్ సర్వర్
- బంట్రోతు
ఇతర వివరాలు
[మార్చు]- ఈ నాటకం నాలుగవ అంకంలోని రెండు పద్యాలు ఘంటసాల వెంకటేశ్వరరావు ఇచ్చిన గ్రామఫోన్ రికార్డు నుండి తీసుకోబడ్డాయి.
- దీనిని శిష్ట్లా వెంకటరావుకు అంకితం ఇవ్వబడింది.
- నాటకం ప్రదర్శించినవాళ్ళు ఐదు రూపాయలను ముంబైలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలకు అందించాలని సూచించారు.[3]
- ఈ నాటకం తొలిప్రదర్శనలో డి.వి.నరసరాజు కథానాయకుడి పాత్ర పోషించాడు.
- గొల్లపూడి మారుతీరావు ఈ నాటకానికి దర్శకత్వం వహించడంతోపాటు ప్రధానపాత్రధారిగా కూడా నటించాడు.
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ ఆర్కైవ్, నాటకాలు. "మహానుభావులు". www.web.archive.org. Retrieved 18 February 2020.
- ↑ వెబ్ ఆర్కైవ్, మహానుభావులు (నాటకం). "పాత్రలు". www.web.archive.org. Retrieved 18 February 2020.
- ↑ వెబ్ ఆర్కైవ్, నాటకాలు. "మహానుభావులు (నాటకం)". www.web.archive.org. Retrieved 18 February 2020.