పంచాంగ శ్రవణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పంచాంగ శ్రవణం అంటే తెలుగు సంవత్సరాదియైన ఉగాది పండుగ నాడు కొత్త సంవత్సరపు పంచాంగాన్ని చదివి వినిపించే సంప్రదాయం. ఉగాది తెలుగు సంవత్సరానికి మొదటి రోజు కావడంతో పాత సంవత్సరపు పంచాంగం మారిపోయి కొత్త పంచాంగం వాడుకలోకి వస్తుంది. వాడుకలోకి వచ్చిన కొత్త పంచాంగాన్ని పంచాంగకర్త, సిద్ధాంతి, జ్యోతిష్కులు వంటివారెవరైనా చదివి, వ్యాఖ్యానించి, శుభాశుభ ఫలాలు వివరించి వినిపిస్తారు. ఉగాది నాడు పంచాంగం వినడం వల్ల శుభకారకమని, భగవదనుగ్రహ కారకమని ధర్మశాస్త్రాలు చెప్తాయి.[1]

ప్రస్తుతం పంచాగాలు చాలా యిళ్లలో కనిపిస్తాయి. కానీ ఒకప్పుడు కేవలం కొద్ది మంది పురోహితులకే ఇవి అందుబాటులో ఉండేవి. కాబట్టి ఉగాది రోజున వారి నుంచి రాబోయే సంవత్సరపు విశేషాలు తెలుసుకునేందుకు అంతా ఒకచోటకి చేరేవారు.  దీని వల్ల పంచాంగ శ్రవణం నలుగురూ కలుసుకుని కష్టసుఖాలను కలబోసుకునే సందర్భంగా కూడా మారుతుంది. పైగా పంచాంగంలో సామాన్యులకు అర్థం కాని విషయాలుండవచ్చు. వాటన్నింటినీ నివృత్తి చేసుకొనేందుకు కూడా ఈ పంచాగ శ్రవణం ఉపయోగపడుతుంది. [2]

ధార్మికపరమైన సందేహాలను తీర్చుకునేందుకు కూడా పంచాంగ శ్రవణం అవసరం. అందుకనే పంచాంగ శ్రవణ చేసినవారికీ, విన్నవారికీ కూడా నవగ్రహాల ఆశీస్సులు లభిస్తాయని ఫలశ్రుతిగా చెబుతారు.

మూలాలు[మార్చు]

  1. పి.వి., సీతారామమూర్తి. "కలికాలంలో కలిసొచ్చే 'పంచాంగ శ్రవణం'". ఆంధ్రభూమి. Retrieved 21 March 2015.
  2. "ఉగాది రోజున పంచాంగం ఎందుకు వినాలి!". TeluguOne Devotional (in english). 2020-09-15. Retrieved 2020-09-15.CS1 maint: unrecognized language (link)