పంజాబ్ లో క్రీడలు
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
పంజాబ్ ప్రజలు కొత్తగా పుట్టిన హాకీ, క్రికెట్ మొదలుకొని భారతదేశ ప్రాచీన ఆటలైన కబడ్డీ, కుస్తీ మొదలైన అనేక రకాలైన ఆటలు ఆడతారు. పంజాబ్ లో కనీసం వందకు పైగా సాంప్రదాయ ఆటలున్నాయి.[1]
పంజాబ్ సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేందుకు వారి ప్రభుత్వం 2014 నుంచి అనేక ప్రయత్నాలు చేపడుతోంది. ఇందులో కుస్తీ పోటీల్లాంటి ఎన్నో ఆటలున్నాయి.[2]
క్రికెట్
[మార్చు]పంజాబ్ లోని క్రికెట్ బాగా ప్రాచుర్యం పొందిన క్రీడ. రాష్ట్రస్థాయిలో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్రీడను నిర్వహిస్తుంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఈ రాష్ట్రం నుంచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆడుతుంది. ఇక్కడి మొహాలీ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించబడుతూ ఉంటాయి.
గట్కా
[మార్చు]గట్కా అనేది సిక్కులు తయారు చేసి, అభివృద్ధి చేసిన ప్రాచీన యుద్ధ శిక్షణా క్రీడ. ఇది దక్షిణ ఆసియాలో చాలా ప్రసిద్ధమైనది. కొన్ని చోట్ల కత్తులకు బదులు కర్రలు వాడి శిక్షణ ఇస్తారు.[3] ఉత్తర భారతంలోని వాయువ్య రాష్ట్రాల శస్త్ర విద్య ఇది. వేర్వేరు ప్రాంతాల్లో దాడి, ప్రతిదాడులు మారతాయిగానీ, ప్రాథమిక టెక్నిక్ మాత్రం మారదు.
కబడ్డీ
[మార్చు]పంజాబ్ వలయాకార కబడ్డీ
[మార్చు]వలయాకారంలో ఆడే కబడ్డీ పంజాబ్ రాష్ట్ర క్రీడ. ఇది కబడ్డీలో ఒక రకం.
కబడ్డీ వరల్డ్ కప్
[మార్చు]వలయాకార పంజాబీ స్టైల్ లో పంజాబ్ రాష్ట్రం 2010 నుండి కబడ్డీ వరల్డ్ కప్ ను నిర్వహిస్తోంది. 2014 పురుషుల కబడ్డీ వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్, పాకిస్థాన్ జట్లు ఆడాయి. 45-42 తేడాతో భారత్ ఈ ఫైనల్స్ లో గెలిచింది.[4] స్త్రీల ఫైనల్ లో భారత్, న్యూజిల్యాండ్ పోటీపడగా, 36-27 తేడాతో భారత జట్టు గెలిచింది.
ముగింపు కార్యక్రమం శ్రీ ముక్త్ సర్ సాహిబ్ లోని గురు గోబింద్ సింగ్ స్టేడియంలో జరిగాయి. పంజాబీ సినిమా తారలు ఆరిఫ్ లోహర్, మిస్ పూజ, గిప్పీ గ్రెవల్, సతిందెర్ సట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ మోటార్ సైకిల్స్ ప్రదర్శన కూడా జరిగింది.[5]
పంజాబ్ ప్రముఖ క్రీడాకారులు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Khed ate sehat varta by Sarwan Singh Sangam Publications ISBN 93-82804-98-6
- ↑ Times of India 30 08 2014
- ↑ Donn F. Draeger and Robert W. Smith (1969). Comprehensive Asian Fighting Arts. Kodansha International Limited.
- ↑ "Zee News 20 12 2014". Archived from the original on 2016-07-23. Retrieved 2016-08-02.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-02-26. Retrieved 2016-08-02.