Jump to content

పండితాపురం

వికీపీడియా నుండి

పండితాపురం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం, కొమ్మినేపల్లి గ్రామ పంచాయతీకి చెందిన గ్రామం.[1].

ఖమ్మం - ఇల్లందు ప్రధాన రహదారిలో ఖమ్మం నుంచి 17 కి. మీ. దూరంలో ఉంది.

సమీప మండలాలు

[మార్చు]

ఖమ్మం అర్భన్, కామేపల్లి, కారేపల్లి మండలాలు

తపాలా సౌకర్యం

[మార్చు]

పండితాపురంలో పోస్ట్ ఆఫీసు, బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రం ఉంది. కావున గ్రామానికి ఉత్తర ప్రత్యుత్తుర సౌకర్యాలు, టెలిఫోన్ సేవలు ఉన్నాయి. మీ సేవ కేంద్రం కూడా ఉంది తద్వారా సాంకేతికంగా అవసరమయ్యే సేవా సదుపాయం ఉంది. దీని వలన రెవెన్యూ సేవలు, ఇతర సాంకేతిక అవసరాలు తేలికగా తీర్చుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా తమ అవసరాలను తీర్చుకునే దిశగా గ్రామం ముందడుగు వేస్తుంది.

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  • ఆదిరాజు వెంకటేశ్వరరావు: తొలితరం (1969) తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ పాత్రికేయుడు, రచయిత, ప్రజాతంత్ర వ్యవస్థాపకుల్లో ఒకరు.[2]
  • బొగ్గారపు సీతారామయ్య :పండితాపురంలో రైతు కుటుంబంలో, 1932, ఆగస్టు-15న జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధునిగా, హైదరాబాదు సంస్థానాన్ని నిజాం పాలన నుండి విముక్తి చేయడంలో సాగిన పోరాట ఉద్యమంలో ఈయన పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. అనంతర కాలంలో సుజాతనగర్ శాసనసభ్యునిగా, ప్రముఖ న్యాయవాదిగా, అంచనాల కమిటీ అధ్యక్షునిగా, శాసనసభ ప్యానల్ స్పీకరుగా పలు విధాలుగా సేవలందించారు. ప్రస్తుతం, హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఎక్కడ ఉన్నా, సొంత జిల్లా పై మమకారంతో, పలు గ్రామాలకు శుద్ధజలం సరఫరాతో పాటు, విరివిగా విరాళాలందించుచూ, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుచూ, తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.[1]

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

పండితాపురం గ్రామంలో ప్రాథమిక విద్య, ఉన్నత విద్యా సౌకర్యాలు ఉన్నాయి. సర్వశిక్షా అభియాన్, అంగన్ వాడి కేంద్రాలు, ప్రాథమిక పాఠశాల కొమ్మినేపల్లి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొమ్మినేపల్లి ద్వారా పలువురు విద్యార్థినీ విద్యార్థులకు విద్యాభ్యాసం చేసే అవకాశం ఉంది. ఇందుకోసం చుట్టూ పక్కల గ్రామాల, గిరిజన తండాల నుంచి పిల్లలు తరలి వస్తుంటారు. అలాగే సమీప పట్టణం అయిన ఖమ్మంలో కళాశాల చదువులతో పాటు పలు రకాల సాంకేతిక ఉన్నత విద్యా అవకాశాలు ఉన్నాయి. పండితాపురం విద్యార్థులు తమ ప్రతిభను కనబరుస్తూ ఉత్తమ ఉత్తీర్ణతా శాతాన్ని నమోదు చేస్తూ మంచి ఫలితాలను రాబడుతున్నారు.

ప్రతి విద్యా సంవత్సరం లోను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మండల స్థాయిలో మంచి ఉత్తీర్ణత సాధించి గ్రామ ఖ్యాతిని గొప్పగా చాటారు. అదే విధంగా ఈ గ్రామంలో ఉన్న యువతీ యువకులు పలు గొప్ప గొప్ప అంతర్జాతీయ కార్యాలయాలో ఉన్నత కొలువులు నిర్వహిస్తూ ఉన్నరు. అందుకు వారి కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల బోధన, గ్రామ పరిసరాలు ఎంతో దోహద పడుతున్నాయి. పండితాపురం నుంచి వెళ్లి పలు ప్రదేశాలలో స్థిరపడిన ప్రముఖులు సైతం వారికి ఆ గ్రామంతో ఉన్న అనుబంధాన్ని పలుమార్లు గుర్తుచేసుకోవడం ద్వారా ఈ గ్రామం యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఎంత గొప్పవో గమనించవచ్చు.

పలువురు రాజకీయ ప్రముఖులు, పత్రికా ప్రముఖులు, విద్యావేత్తలు పండితాపురం గ్రామ పూర్వ విద్యార్థులుగా తమను తాము పరిచయం చేసుకున్న సందర్భంలో ఈ గ్రామంలోని పాఠశాలల యొక్క గొప్పదనం, గురువుల యొక్క బోధన పటిమ ఎంత గొప్పదో ఈ సంఘానికి అర్ధం అవుతుంది. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల స్థాయి లోనే గురుకుల విద్యాలయాలు, జవహర్ నవోదయ పాఠశాలలలోకి ప్రవేశాల కొరకు మార్గనిర్దేశం చేస్తూ పిల్లల ఉన్నత విద్య కొరకు అత్యున్నత బాటలు వేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నత పాఠశాల స్థాయి లోనే కంప్యూటర్ విద్యను భోదిస్తూ పిల్లల సాంకేతిక అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుంది. ఇక పాలిటెక్నిక్ డిప్లొమా, ఇంజనీరింగ్, డిగ్రీ, పిజీ వంటి ఉన్నత సాంకేతిక విద్యను అభ్యసించడంలో ఇక్కడి గ్రామీణ పాఠశాలలలోని విద్యావిధానం ఎంతో తోడ్పడుతుంది.

పండితాపురం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొమ్మినేపల్లిలో తెలుగు మాద్యమంతో పాటు ఆంగ్ల మాద్యమంలో కూడా భోదిస్తారు. అందువల్ల ఈ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు పలు భాషల ఫై అవగాహన ఏర్పడుతుంది, వారిని మానసికంగా దృఢంగా చేస్తుంది. ఈ గ్రామం లోని అన్ని పాఠశాలలో కూడా పిల్లలకు ఆటల పట్ల అవగాహన కలిగిస్తారు అందువల్ల వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారు. పలుచోట్ల జరిగే ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ఈ గ్రామ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని వారి ఉన్నత ప్రతిభను కనబరుస్తూ మంచి విజయాలు సాదిస్తున్నారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు దేవాలయాలు

[మార్చు]

పండితాపురం గ్రామంలో పలు హిందూ దేవాలయాలతో పాటు చర్చ్, మసీద్ లు ఉన్నాయి. దీని వల్ల గ్రామంలో భక్తి సామరస్యం కలిగి ఉంది అనే విషయం తేటతెల్లం అవుతుంది. ఈ గ్రామంలోని ఒక్కో ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత, విశిష్ట చరిత్ర కలిగి ఉన్నాయి. ఇక్కడి ప్రజలు అన్ని పండుగలు, పర్వదినాలను చాల భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

పండితాపురం గ్రామం అనగానే ముందు గుర్తుకు వచ్చేది అక్కడి శివాలయం. ఇది కొండాయిగుడెం శివారులో ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. దీన్ని పూర్వం కాకతీయుల పాలనా కాలంలో నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు, పూర్వీకుల అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ అర్చకుల సమక్షంలో నిత్యం పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అందుకు గాను స్వామివారి కళ్యాణమండపం కూడా ఉంది. అలాగే జాతర, పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పండితాపురం గ్రామ ప్రధాన రహదారి సమీపంలో ఉన్న శ్రీ షిర్డీ సాయి బాబా మందిరం కూడా ప్రముఖమైనది. దీన్ని 1997 లో కీ॥శే॥ శ్రీ ఆత్మకూరి చంద్రశేఖర్ రావు గారు, వారి కూతురు శైలజ ల జ్ఞాపకార్ధం వారి కుటుంబీకులు నిర్మించారు. ఇక్కడి ఆలయంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి, వినాయకుడు, సాయిబాబా ల మంటపములు ఉన్నాయి. ఇక్కడ నిత్యం వేదపండితుల సమక్షంలో పూజలు, భజనలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రధాన రహదారి సమీపంలో ఉండటం ద్వారా చుట్టూ పక్కల నుంచి భక్తులు నిత్యం తరలి వస్తారు.

పండితాపురం గ్రామంలో బొడ్రాయి, రామాలయం, గ్రామా దేవతలు అయిన ముత్యాలమ్మ తల్లి ఆలయం ఉన్నాయి. ఇక్కడ నిత్యం పలు రకాల పూజలు జరుపుతారు. అలాగే ప్రతీ సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ, కార్తీక మాసంలలో గ్రామదేవతలకు ప్రభలు కట్టి ఉత్సవాలు జరుపుతారు. వినాయక చవితి పర్వదినం సందర్భంలో పలు ప్రదేశాలలో వినాయక మంటపాలు నిర్మించి విశిష్ట పూజలు, పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఉట్ల పండగ నిర్వహించి గ్రామంలోని యువత ఎంతో ఉత్సాహంతో ఉట్లు కొడతారు. దసరా పండగ సమయంలో దేవీనవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. గ్రామంలోని మహిళలు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు.

పండితాపురంలో ఉన్న చర్చిలో ప్రతి ఆదివారం, ముఖ్యమైన పండగల సందర్భంలలో ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుతారు, గుడ్ ఫ్రైడే ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు. అదేవిధంగా గ్రామంలోని మసీద్ యందు నిత్యం పలుమార్లు నమాజ్ లు జరుపుతారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో ప్రార్థనలు జరుపుతారు అలాగే బక్రిద్, మొహరం (పీర్ల పండగ) ఘనంగా నిర్వహిస్తారు. ఈ విధంగా గ్రామంలో సర్వమత సమ్మేళనంగా అన్ని రకాల పండగలు జరుపుకుంటారు.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

పండితాపురం గ్రామంలో వ్యవసాయ రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రామంలో ప్రాచీన వ్యవసాయ విధానాలతో పాటుగా ఆధునిక వ్యవసాయ విధానాలను కూడా అనుసరిస్తూ వ్యవసాయరంగ అభివృద్ధికి గ్రామ రైతులు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ గ్రామంలో ముఖ్యంగా వరి, పత్తి, మిరప, మొక్కజొన్న, అపరాలు వంటి పంటలు ఎంతో కీలకం. ముఖ్యంగా గ్రామంలోని నీటి వనరులకు తగు విధంగా వరి పంటను అధికంగా సాగు చేస్తారు. తరువాత స్థానాలలో పత్తి, మిరప పంటలుగా చెప్పుకోవచ్చు.

ఈ గ్రామంలో వ్యవసాయ పనిముట్ల విషయంలో ఆధునిక విధానం యొక్క పాత్ర చాల కీలకం. ముఖ్యంగా ట్రాక్టర్ పనిముట్లు, దుక్కి దున్నే విషయంలో కూడా రైతులకు సులభ మార్గాల ద్వారా పని జరుగుతుంది. అదేవిధంగా సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు ఉపయోగించడంలో కూడా రైతులు ముందున్నారు.

ఇక ఈ గ్రామంలో పశుపోషణ, పాడి పరిశ్రమల ద్వారా సన్నకారు, మధ్యతరగతి రైతులు తమ ఉపాదికి భాతలు వేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా ఆవులు, గేదెల పెంపకం, గొర్రెల పెంపకాలుగా చెప్పవచ్చు. వీటికి అర్హులైన గ్రామీణ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తరుపున రుణాలు కూడా మంజూరు చేస్తున్నారు. గ్రామంలోని రైతులను ఉత్సాహపరిచే క్రమంలో పలువురు రైతులను వారి యొక్క వ్యవసాయ రంగ సేవలకు గాను ఆదర్శ రైతులుగా గుర్తించి ప్రభుత్వం వారిని సత్కరిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-08.
  2. "Veteran journalist Adiraju passes away". The Hindu. Special Correspondent, Special Correspondent. 2018-06-16. ISSN 0971-751X. Retrieved 2018-06-18.{{cite news}}: CS1 maint: others (link)

వెలుపలి లంకెలు

[మార్చు]

[1] ఈనాడు ఖమ్మం; 2014, జనవరి-29; 8వ పేజీ.