Jump to content

పందుల పెంపకం

వికీపీడియా నుండి

పందుల పెంపకం ఒక కుటీర పరిశ్రమ. దీనిపై కొన్ని జాతుల ప్రజలు జీవిస్తున్నారు.

పంది జాతులు

[మార్చు]
  • పెద్ద యార్క్‌షైర్‌ జాతి 350 నుండి 400 కి. గ్రా. బరువు
  • బెర్షైర్‌ సగటున 275 కి. గ్రా.
  • లాండ్రాస్‌
  • తామ్‌వర్త్‌
  • చెస్టర్‌ వైట్‌
  • హాంప్‌షైర్‌ (నలుపు)
  • పోలాండ్‌ చీనా
  • స్పాటెడ్‌ పోలాండ్‌ చీనా

పందుల పెంపకంతో ప్రయోజనాలు[1]

[మార్చు]
  • పందులు తినడానికి వీలులేని పదార్ధాలు, వదిలేసిన ఆహారపదార్ధాలు, మిల్లుల్లో లభించే కొన్ని ఆహారధాన్యాల అనుబంధ ఉత్పత్తులు, మాంసం అనుబంధ ఉత్పత్తులు, చెడిపోయిన మేత, పారేసిన పదార్ధాలను తిని విలువైన, పోషకవిలువలతో కూడిన మాంసంగా మారుస్తాయి. పై పదార్ధాలన్నీ మనుషులు తిననివి, తినడానికి వీలులేనివి.
  • పందులు త్వరగా పెరుగుతాయి. మంచి పంది ఒక్కఈతలో పది నుంచి పన్నెండు పిల్లలను ఈనుతుంది. మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో అది సంవత్సరానికి రెండుసార్లు ఈనగలదు.
  • పంది కళేబరంనుంచి లభించే మాంసం, గొర్రెలు, కోళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. బతికున్నప్పటి బరువులో 60-80శాతం మాంసం లభిస్తుంది.
  • భవనం, పరికరాలు, సరైన మేత అందించడం, వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారాను వాటిపై పెట్టే కొద్ది పెట్టుబడులద్వారా, రైతు తక్కువ సమయంలో తక్కువ, కూలీలను వెచ్చించడంతో.... ఈ వృత్తిలో మంచి లాభాలను గడించవచ్చు.
  • పందిపెంట భూసారాన్ని పెంచడానికి చక్కటి ఎరువుగా పనికొస్తుంది.

పందుల పెంపకం ఎవరికి పనికొస్తుంది?

  • చిన్న, భూమిలేని పేదలు
  • వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకున్న విద్యావంతులైన యువతకు అదనపు ఆదాయంగా ఉంటుంది.
  • నిరక్షరాస్య యువత
  • వ్యవసాయ కూలీ మహిళలు

వాణిజ్య సరళిలో పందుల పెంపకం - లాభాలు

  • ఇతర వ్యాపారాలన్నింటి కంటే తక్కువ పెట్టుబడితో శీఘ్రంగా ద్రవ్యఫలితాన్నిచ్చేది పందుల పెంపకం.
  • కోళ్ళ పెంపకంమూ, పాడి పరిశ్రమ కంటే కూలి ఖర్చు తక్కువ.
  • అన్ని రకాల క్షేత్రాలకు అనుకూలం.
  • దాణా మార్పిడి నిష్పత్తి ఎక్కువ. అంటే మూడు
  • మూడున్నర దాణాకు ఒక కిలో పోర్కు మాంసం లభిస్తుంది.

పందిపిల్లల్లో రక్తహీనత
పందిపిల్లల్లో రక్తహీనత అనేది సాధారణంగా వచ్చే పౌష్ఠకాహార లోపం. ఇనుపధాతువును నోటిద్వారాగానీ, ఇంజెక్షన్ ద్వారాగానీ ఇవ్వడం ద్వారా దీనిని నివారించవచ్చు. ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాన్ని (0.5కిలో ఫెర్రస్ సల్ఫేట్ ను పదిలీటర్ల వేడినీటిలో కలపాలి) తల్లిపంది పొదుగుకు రాయడంద్వారాగానీ చల్లడంద్వారాగానీ పందిపిల్లలకు ఇనుపధాతువును నోటిద్వారా అందించవచ్చు. అవి పుట్టిన దగ్గరనుంచి మేత తినేవరకు ఇలా ఇనుపధాతువును అందించాలి.

అనాధ పందిపిల్లలను పెంచడం
ఈనిన తర్వాత తల్లిపంది చనిపోవడం, ఒక్కోసారి తల్లి పంది పాలు ఇవ్వలేకపోవడం, ఎక్కువ పిల్లలు పుట్టినప్పుడు పాలు చాలకపోవడం వంటి సందర్భాలలో కొన్ని పిల్లలు అనాథలవుతాయి. అదేసమయంలో ఇంకో పంది ఈనితే ఈ పిల్లలను దానిదగ్గరకు మార్చవచ్చు. అయితే ఇలా మార్చడం ఈనిన వెంటనే జరగాలి. కొత్తపిల్లలను ఆ మరొక పంది అంగీకరింపచేయడానికిగానూ, దానిపిల్లలను కూడా కొంతకాలం పక్కనపెట్టాలి. ఆ తర్వాత కొత్తపిల్లలను, అసలు పిల్లలను కలిపి వాటన్నటిమీద ఏదైనా ద్రావణాన్ని చల్లడంద్వారా వాసనలను మరుగునపరచాలి.

అనాధపిల్లలను పాలప్రత్యామ్నాయంతో కూడా పెంచవచ్చు. ఒక లీటరు పాలలో ఒక కోడిగుడ్డు పచ్చసొన కలిపి దీనిని తయారుచేయాలి. ఈ మిశ్రమంలో ఇనుము తప్పితే అన్ని పోషకవిలువలూ ఉంటాయి. ఇనుముకోసం ఒకలీటరు పాలలో కొద్దిగా ఫెర్రస్ సల్ఫేట్ కలిపి తాగించాలి. ఇనుమును ఇంజెక్షన్ రూపంలో కూడా ఇవ్వవచ్చు.

పునరుత్పాదకసామర్ధ్యం తొలగింపు
పునరుత్పాదకతకు పనికిరావనుకుంటున్న మగపందిపిల్లలకు మూడు, నాలుగు వారాల వయస్సులో వృషణాలు తొలగించవచ్చు.

ఎక్కువ పాలివ్వడానికి తీసుకోవాల్సిన చర్యలు
పాలిచ్చే ఆడపందులకు తదనుగుణంగా మంచి మేత ఇవ్వాలి. ఒక్కోపందిపిల్లకు అరకేజిచొప్పున తల్లిపందికి ఎన్ని పందిపిల్ల లుంటే అంత అదనపు మేత ఇవ్వాలి.

తల్లిపందినుంచి పిల్లలను వేరుచేయడం
పందిపిల్లలకు మేత అలవాటుచేయడం 8వారాల వయస్సునుంచి ప్రారంభించాలి. తల్లిపందిని ప్రతిరోజూ కొద్దిసేపు వేరు చేస్తూ ఒక్కసారిగా పిల్లలను దూరంచేస్తే కలిగే వత్తిడిని నివారించాలి...మేతను కూడా తగ్గిస్తూ ఉండాలి. మేత ప్రారంభించిన రెండువారాల తర్వాత క్రిముల తొలగింపుకు వాటికి మందు ఇవ్వాలి. రెండువారాలలో 18 శాతం ప్రోటీన్ ఉండే మేతనుంచి 16 శాతం గ్రోయర్ మేతకు పిల్లలను మారవాలి. ఒక్కోదొడ్డిలో ఒకే వయస్సున్న 20 పిల్లలను ఉంచాలి.

పందులకు వచ్చే వ్యాధుల నివారణ, నియంత్రణ
2-4వారాల వయస్సులో ప్రతిపందికీ స్వైన్ ఫీవర్ టీకాలు వేయించాలి. గర్భందాల్చే పందులకు బ్రుసెలోసిస్, లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధులున్నాయేమో పరీక్షించాలి. మేత తినడం ప్రారంభించే పందిపిల్లలన్నిటికీ స్వైన్ ఫ్లూ టీకా తప్పనిసరిగా వేయించాలి.

పందులను కొనుగోలు చేసేటప్పుడు వ్యాధులు లేని మందలనుంచి కొనుగోలు చేయాలి. కొత్తగా కొనుగోలు చేసిన పందులను మూడు, నాలుగు వారాలదాకా పాత మందలో కలపకూడదు. దొడ్డిని చూడడానికి ఎవరినీ అనుమతించకూడదు. కొత్తవాటిని ఉంచే దొడ్లను మూడు, నాలుగు వారాలదాకా ఖాళీగా ఉంచితే అక్కడ సూక్ష్మక్రిములేమైనా ఉంటే అవి తొలగిపోతాయి.

వనరులు

[మార్చు]
  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]