Jump to content

పగడపు దిబ్బ

వికీపీడియా నుండి

సాంకేతిక భాషలో ప్రవాళ భిత్తికగా పిలవబడే పగడపు దిబ్బని ఇంగ్లిషులో కోరల్ రీఫ్ అని అంటారు. సీలెంటిరేటా జీవులు కాల్షియం కార్బొనేట్ కవచాన్ని నిర్మించుకుంటాయి. దీనినే ప్రవాళం (పగడం) (కోరల్) అంటారు. కాల్ కేరియస్ అస్తిపంజరం ఏర్పరచు అన్ని సీలెంటిరేటా జీవులకు ప్రవాళము అన్వయింపబడుతుంది.

ప్రవాళములలో ఏవో కొన్ని హైడ్రొజొవన్ పాలిప్ లు తప్ప మిగిలిన అన్ని ప్రవాళములు అంథొజొవా తరగతికి చెందినవి. ఎరుపు, నీలం, నలుపు ప్రవాళాలు అల్ల్సియయోనేరియ క్రమానికి చెందినవి. ప్రవాళాలు ప్రవాళాల గోడలను ఏర్పరుస్తాయి.

ప్రవాళాలు-ఉనికి

[మార్చు]
  1. ప్రవాళపు మొలకలు భూగోళంలో 20°, 30 అక్షాంశాల మద్య ఆయనరేఖ సముద్ర ప్రాంతనికి మాత్రమే పరిమితమైనవి.
  2. ఇవి సముద్రము యొక్క ఉష్ణోగ్రత 20 కన్న తక్కువగ ఉండిన ప్రాంతంలో జీవించగలవు.
  3. అయితే పశ్చిమ తీర ఖండ ప్రాంతాలయిన ఆయన రేఖా సముద్రతీరంలో ప్రవాళాలు కనిపించవు. దీనికి కారణం సముద్రపు అడుగు భాగం నుండి చల్లని నీరు పైకి రావడం.
  4. ప్రవాళలు సముద్ర మట్టముకన్న ఎక్కువ ఎత్తుకు వచ్చినప్పుడు జీవించలేవు. కావున ప్రవాళాలు సముద్రంలో సంభవించే ఆటు, పోటులతో పాటు మట్టానికి కిందవరకు మాత్రమే పరిమితమై ఉంటాయి.
  5. ప్రవాళాలు సముద్రమట్టం నుండి 45 నుండి 50 మీటర్లు లోపలకు మాత్రమే పెరుగుతాయి. ప్రవాళాలు ఆక్సిజన్ ఎక్కువగా కలిగిన పరిశుభ్రమైన నీరు, సూక్ష్మజీవులు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]