పచ్చికాల్వ
పచ్చికాల్వ, చిత్తూరు జిల్లా, వడమాలపేట మండలానికి చెందిన గ్రామం.[1]
పచ్చికాల్వ | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | చిత్తూరు |
మండలం | వడమాలపేట |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | |
- పురుషుల | 160 |
- స్త్రీల | 180 |
- గృహాల సంఖ్య | 96 |
పిన్ కోడ్ | 517551 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
పచ్చి కాల్వ గ్రామం నకు ఉత్తర దిక్కున ఒక కాలువ పాచితో నిండి ఎల్లప్పుడూ ప్రవహించుచుండెది, ఆ కాలువ పేరు పాచి కాలువ. క్రమముగా పాచి కాలువ పచ్చి కాలువగా రూపాంతరము చెంది ఇప్పుడు పచ్చి కాల్వ గ్రామంగా వాడుకలో ఉంది
సమీప గ్రామాలు[మార్చు]
పచ్చి కాల్వకు చుట్టు పక్కల అనెక గ్రామాలు ఉన్నాయి.అందులో ముఖ్యమైనవి తూర్పు దిక్కున చింత కాలువ, పడమర గురవ గారి పల్లి (బ్రాహ్మణ కాల్వ), ఉత్తరమున పానకం దక్షిణమున రవిళ్ళ వారి పల్లె ఉన్నాయి.
సమీప మండలాలు[మార్చు]
పచ్చి కాల్వ వడమాల పేట మండలంలో ఉంది. ఈ గ్రామంకు అతి దగ్గరలో చంద్రగిరి మండలం, తిరుపతి రురల్ మండలాలు ఉన్నాయి.
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
పచ్చి కాల్వ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో 1 నుండి 5వ తరగతి వరకు విద్యను భొదిస్తున్నారు. ఈ పాఠశాల యందు సుమారు 30 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్థున్నారు. ఇవికాక ఈ గ్రామం తిరుపతికు అతి దగ్గరగా ఉండటము వలన ఉన్నత స్థాయి విద్య అత్యంత అందుబాటులో ఉంది
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
పచ్చి కాల్వ గ్ర్రామము తిరుపతికు 12 కిలోమిటర్ల దూరములో ఉంది కావున అనెక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి నుండి నిర్ణిత సమయములో ఆర్ టి సి బస్సు సౌకర్యము ఉంది. ఇవి కాక పచ్చి కాల్వ చుట్టు ప్రక్కల గ్రామాలకు ప్రతి 5ని" తిరుపతి నుండి బస్సు సౌకర్యము కలదు, ప్రైవెటు ఆటొ రిక్షాలు ఎల్లప్పుడు అందుబాటులో ఉన్నయీ.
గ్రామ జనాభా[మార్చు]
- జనాభా (2001) - మొత్తం 313 - పురుషుల 149 - స్త్రీల 164 - గృహాల సంఖ్య 73
- జనాభా (2011) - మొత్తం 340 - పురుషుల 160 - స్త్రీల 180 - గృహాల సంఖ్య 96
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-07-27.