పపియా అధికారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పపియా అధికారి
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1985-ప్రస్తుతం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ

పపియా అధికారి, బెంగాలీ సినిమా నటి, జాత్రా (థియేటర్) నిర్వాహకురాలు. 2021, ఫిబ్రవరి 17న భారతీయ జనతా పార్టీలో చేరింది.

కెరీర్

[మార్చు]

పపియా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగరంలో జన్మించింది.[1] మొదటగా 1985లో రతీష్ దే సర్కార్ దర్శకత్వం వహించిన సోనార్ సన్సార్ సినిమాలో తొలిసారిగా నటించింది. సోషానే కండ్చే లక్కీలో ప్రధాన పాత్ర పోషించిన తర్వాత పపియా నటనకు గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలోని నటనకుగాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది.[2] అనేక బెంగాలీ చిత్రాలలో హీరోయిన్ పాత్రలలో నటించిన పపియా, టీవిరంగంలోకి ప్రవేశించి గచ్‌కౌటో, చోఖేర్ తారా తుయ్, గ్యాంగ్‌స్టర్ గంగా వంటి బెంగాలీ టెలి-సీరియల్‌లలో కూడా నటించింది.[3][4]

సినిమాలు (పాక్షిక జాబితా)

[మార్చు]
  • సోనార్ సన్సార్
  • ప్రతిజ్ఞ
  • స్వర్ణమోయిర్ తికాన
  • మౌనా ముఖర్
  • ఆగమనం
  • ప్రతీక్
  • పాఠే జేతే జేతే
  • నిషి బధు
  • అభిసార్
  • ప్రతిశోధ్ (2004 చిత్రం)
  • పతి పరమ గురువు
  • రాజర్ మేయే పరుల్
  • సంప్రదాన్
  • మేయర్ అదార్
  • శంక
  • హన్షి ఖుషీ క్లబ్
  • రోజ్ క్రేజీ రోజ్
  • ప్రోబహిని
  • కింటు గల్పో నోయ్
  • బాబ్లీ
  • మోనేర్ మాఝే తుమీ
  • సోటోరోయ్ సెప్టెంబర్

మూలాలు

[మార్చు]
  1. "Papiya Adhikari". photogallery.navbharattimes.indiatimes.com. Retrieved 2012-01-07.
  2. "Papiya Adhikari - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2012-01-07.
  3. "Papiya Adhikari joins the cast of Gangster Ganga - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2012-01-07.
  4. Bangaliana, Sholoana. "Colors Bangla New Serial Gachkouto | Sholoanabangaliana Portal" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-09-01. Retrieved 2012-01-07.