పరపరాగ సంపర్కము
స్వరూపం
ఒక మొక్కలోని పుష్పములలో వుండే పరాగ రేణువులు అదే మొక్కకు సంబంధించిన మరొక పుష్పములోని కీలాగ్రమును చేరుటను, లేదా అదే జాతికి చెందిన మరొక చెట్టు పుష్పములోని కీలాగ్రమును చేరుటను పరపరాగ సంపర్కము అని అంటారు.
పుష్పములోని పరాగ రేణువులు ఒక పుష్పమునుండి మరొక పుష్పములోనికి చేరడం అనేక విధములుగా జరుగుతుంది.
- గాలివలన: వరి, మొక్కజొన్న, గోదుమ మొదలగు వాటిలో గాలి వలన పరపరాగ సంపర్కము జరుగుతుంది.
- పక్షులు, జంతువులు, కీటకాలు, తేనెటీగలు, సీతాకోక చిలుకలు మొదలగు వాటి వలన కూడా పరపరాగ సంపర్కము జరుగు తుంది. కీటకములు, అనగా... సీతా కోక చిలుకలు, తేనె టీగలు మొదలగునవి మకరందము కొరకు ప్రతి పువ్వుమీద వాలి అందులోని మకరందమును గ్రోలుతాయి. ఆ సమయంలో ఆ పుష్పములోని పరాగ అరేణువులు ఆ కీటకాల కాళ్ళకు అంటుకొని ఆ కీటకాలు మరొక పుష్పము పై వాలినప్పుడు ఆ పుష్పము పై చేరును. ఈ ప్రక్రియ కొరకే పువ్వులలోని మకరందము ఏర్పడుతున్నది. పువ్వులకు రంగులు/ వాసన కూడా ఈ ప్రక్రియ కొరకు కీటకములను ఆకర్షించడానికే ఏర్పడినవి.