Jump to content

పరాన్నబుక్కులు

వికీపీడియా నుండి


ఒక జీవిపై మరొక జీవి ఆధారపడి బ్రతుకుట - పరాన్న బుక్కు

పరాన్నబుక్కులు/పరాన్న జీవులు

[మార్చు]
పరాన్న భుక్కులు. (Parasites )

ఇతరుల శరీరాలలో నివసించుచు తమ పోషకుల యొక్క ఆహారాదుల యందు పాలుగొని జీవించు నొక జాతి జీవులకు పరాన్న భుక్కులని పేరు. ఇందు కొన్ని తమ పోషకులకే వ్యాధిని పుట్టించును. ఇవి సూక్ష్మ జీవుల జాతిలోనివి కావు. వానితో పోల్చగా నివి మిక్కిలి పెద్దజీవులు. వీని మూలమున కూడా మానవ దేహాన కొన్ని వ్యాధులు వ్యాపించును. అందులో మిక్కిలి తరుచుగా నున్న గజ్జిని బోదకాలు పుట్టించు పరాన్న భుక్కులను గూర్చి కొంచెము వివరించబడింది.

గజ్జిపురుగులు

[మార్చు]

మగ గజ్జిపురుగుల కంటే ఆడువి రెట్టిపు పెద్దవి. వీనికి రెంటికిని ముట్టెల వలె నుండు కాళ్ళు నాలుగు ముందు వైపునను, ముండ్లవలె నుండు కాళ్లు నాలుగు వెనుక వైపునను ఉండును. పురుషాగములు మగదాని వీపుమీదను, స్త్రీయంగములు ఆడుదాని పొట్ట మీదను నుండును. మగది చర్మము పై తట్టున తిరుగులాడు చుండును. అడుది లోలోపలికి దొలుచుకొని పోవుచు తాను బోవు మార్గమున దినమున కొక గ్రుడ్డు పెట్టుకొను చుండును.

బోదకాలు కలిగించు పురుగులు.

[మార్చు]

ఇవి మానవుని రక్తవాహికల (సిరలు, ధమనులు) కంటే అల్పమగు రసపు ప్రవాహిక (Ltnoghatuc Vessels ) తిరుగు లాడు చుండును. ఇవి గజ్జలు, చంకలు, మొదలగు చోట్ల నుండు బిళ్ళలలో దూరి యొకా నొకప్పుడు ఈ వాహికల కడ్డుపడుటచే వాని క్రింది భాగము లోని రసప్రవాహానికి కడ్డు పడును. అంతట వాని క్రింది భాగము లోని రసమంతయు నిలిచి పోయి వాపుగ నేర్పడి క్రమ క్రమముగ లావెక్కును.

ఇవి రాత్రుల యందు రక్తములో తిరుగుచుండును. వీని మూలాన అప్పుడప్పుడు జ్వరమును, ఏనుగుకాలు వలే వాపును కలుగును. ఇట్టి వాపు కాళ్ళు, చేతులు, చన్నులు, స్త్రీ-- పురుషాంగములు వీనిలో నెక్కడయిన గలుగవచ్చును. వీటి పిల్లలు దోమలు త్రాగు రక్తముతో వాని కడుపు లోనికి పోయి, అక్కడ పెరిగి పెద్దవై తిరిగి దోమ కాటు వలన గాని, లేదా ఆ దోమలు చచ్చిపడి యున్న నీటిని త్రాగుట వలన గానీ క్రొత్త వాళ్ల రక్తంలో చేరును.