పరిక కంప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Ziziphus oenoplia
Ziziphus oenoplia Blanco2.433-cropped.jpg
Plate from Francisco Manuel Blanco’s Flora de Filipinas (1880-1883)
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
Z. oenoplia
Binomial name
Ziziphus oenoplia
(L.) Mill.
Synonyms
  • Rhamnus oenoplia L.
Leaves and fruits
పరిక కంప

పరిక కంపను పరికి, పరిక అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం Ziziphus oenoplia, ఆంగ్ల నామం Jackal Jujube. పరిక కంప చెట్టు చెట్టంతా ముళ్ళతో ఉంటుంది, ఈ ముళ్ళు చిన్నవిగా ఉన్నప్పటికి గట్టిగా, పదునుగా, గాలం వలె వంకర తిరిగి ఉంటాయి. మామూలుగా 5 అడుగులు ఎత్తు పెరిగే ఈ చెట్లు ఇతర చెట్లను ఆధారం చేసుకొని సుమారు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది.

పండ్లు[మార్చు]

ఈ చెట్ల కాయలు చాలా చిన్నవిగా బటానీల కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. పచ్చివి ఆకుపచ్చ రంగులోను, దోరవి ఎరుపు రంగులోను, బాగా మాగినవి నలుపు రంగులోను ఉంటాయి. ఈ కాయలను విత్తనాలలో సహ నమిలి తింటారు. బాగా మాగిన కాయలు పుల్లగా, తీయగా బాగా రుచిగా ఉంటాయి.

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

రేగు

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పరిక_కంప&oldid=2986551" నుండి వెలికితీశారు