పరివ్రాజకులు
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
సంసారాన్ని వదలివేసిన యతి/ సన్యాసి. వీరిలో కుటీచక, బహూదక, హంస, పరమహంసలనే నాలుగు విధాల యతులు ఉన్నారు. ‘‘పరిత్యజ్య సర్వం ప్రజతీతి పరివ్రాట్’’ అని అమరం. సర్వాన్ని వదలివేసిన వారు పరివ్రాజకులు. 1. కుటీచక యతులు అంటే త్రిదండిగా ఉండి ఇల్లు వదలిపోకుండా కొడుకు పెట్టే భిక్ష స్వీకరిస్తుండేవాడు. 2. సంప్రదాయ పద్ధతిలో సన్న్యాసం తీసుకొని నిరంతరం సంచారం చేస్తుండే త్రిదండధారి బహూదకుడు. గ్రామాలలో ఒక రోజు, పట్టణాలలో మూడేసి రోజులు, పుణ్య క్షేత్రాలలో ఐదారు రోజులు గృహస్థుల ఇళ్లలో భిక్ష స్వీకరిస్తూ సంచారం చేస్తుంటాడు. 3. హంస సన్న్యాసి ఏకదండి. గ్రామాలలో సాధారణంగా ఒక రోజు మించి ఉండడు. 4. పరమహంస కూడా ఏకదండి. ఆత్మ నిష్ఠ కలిగినవాడు. పరివ్రాజకుల నిత్య వ్యవహారాలకు సంబంధించిన అనేక నియమాలు ఉన్నాయి. అందులోనూ వ్యత్యాసాలు ఉన్నాయి.[ఆధారం చూపాలి]