పరువు హత్యలు
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2017) |
పరువు హత్యలు (honor killings) అనేవి మత సమాజాల్లో వ్యక్తిగత కుటుంబ పరువు, గౌవరవం, మర్యాద వంటి పేర్లతో జరిగే హత్యలు. ఈ హత్యలు ఎక్కువగా ఇస్లామిక్ దేశాలలో జరుగుతుంటాయి. హిందూ దేశాలైన ఇండియా, నేపాల్ లోనూ, కొన్ని క్రైస్తవ దేశాలలోనూ కూడా ఈ హత్యలు కనిపిస్తుంటాయి. ప్రేమ, పెళ్ళికి ముందు సెక్స్, మతాంతర వివాహం, జాత్యాంతర వివాహం లాంటివి చేసుకున్న వారిని పరువు పేరుతో హత్య చెయ్యడం జరుగుతోంది.
ముస్లిమ్ దేశాలలో పరువు హత్యలు
[మార్చు]అనేక ముస్లిమ్ దేశాలలో పరువు హత్యలకి పూర్తి లేదా పాక్షిక చట్టబద్దత ఉంది. పాకిస్తాన్, టర్కీ దేశాలలో ఈ హత్యలకి చట్టపరమైన అనుమతి లేకపోయినా మత పెద్దల ఆదేశాల ప్రకారం ఈ హత్యలు చేస్తుంటారు.
ఇండియాలో పరువు హత్యలు
[మార్చు]ఇండియాలో పరువు హత్యలు ఎక్కువగా పంజాబ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో జరుగుతున్నాయి. ఈ హత్యలని కొందరు రాజకీయ నాయకులు కూడా బహిరంగంగా సమర్థిస్తున్నారు.[1] ఈ హత్యల పెరుగుదలపై మహిళా సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-02. Retrieved 2008-12-27.