Jump to content

పలుగుంటిపల్లి

అక్షాంశ రేఖాంశాలు: 15°28′47.424″N 78°57′44.064″E / 15.47984000°N 78.96224000°E / 15.47984000; 78.96224000
వికీపీడియా నుండి
పలుగుంటిపల్లి
గ్రామం
పటం
పలుగుంటిపల్లి is located in ఆంధ్రప్రదేశ్
పలుగుంటిపల్లి
పలుగుంటిపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°28′47.424″N 78°57′44.064″E / 15.47984000°N 78.96224000°E / 15.47984000; 78.96224000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంరాచర్ల
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08405 Edit this on Wikidata )
పిన్‌కోడ్523368

పలుగుంటిపల్లి, ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర

[మార్చు]

పూర్వ కాలంలో భగవంతుడు అయిన ఆంజనేయ స్వామి వారు ఆకాశ మార్గాన ఈ గ్రామం పై నుంచి ప్రయాణిస్తూ ఉన్న సమయంలో ఆయన చేతి లోని పాల కుండ పొరపాటున క్రింద పడి పగిలి పోయి దానిలో ఉన్న పాలు ఒక పెద్ద తెల్లని రాయిగా మారాయి . ఆ తెల్లని రాయి నే పలుగు గుండు అని పిలిచారు అప్పటి నుండి ఈ ఊరు పేరు పలుగుంటి పల్లి అని పిలవడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఇది ఊరికి ఉత్తరం దిశలో ఉంది

విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు, ఈ పాఠశాల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించడంతో, ఈ పాఠశాల ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుచుచున్నది. విద్యార్థుల యొక్క క్రీడా స్ఫూర్తి అభినందించ తగినది

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  1. శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయ పంచమ వార్షికోత్సవ మహోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ప్రారంభించెదరు. మరుసటి రోజు ఉదయం స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించెదరు. అనంతరం శాంతిహోమం నిర్వహించెదరు. సాయంత్రం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించెదరు.[1]
  2. శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం.
  3. ఈ గ్రామంలో 27 అడుగుల హనుమన్ విగ్రహం వద్ద ప్రతిష్ఠించు విగ్రహాలకు, 2015, నవంబరు-24వ తేదీనాడు గ్రామోత్సవం నిర్వహించారు.[2]
  4. ఈ గ్రామంలో సుమారు 20 లక్షల ఖర్చు చేసి ప్రతిష్ఠాత్మకంగా పీర్ల చావిడి నిర్మించారు
  5. ఈ గ్రామంలో ముుఖ్యమైన పండుగ మొహరం (పీర్ల పండుగ)
  6. గ్రామంలో ఉత్తరం వైపు చారిత్రక ఆధారం అయిన తెల్లని పలుగు రాయి ఉన్నది దీని ఎత్తు సుమారు 20 అడుగులు
  7. ఈ గ్రామంలో రాబోవు 2 సంవత్సరాలలో శివుని గుడి నిర్మించ తలపెట్టారు

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మిరప, పత్తి, మల్బరీ సాగు, కూరగాయలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం. ఆర్మీ, పారా మిలటరీ, సాఫ్టువేర్

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు ప్రకాశం; 2014, మే-15; 4వపేజీ.
  2. ఈనాడు ప్రకాశం; 2015, నవంబరు-25; 5వపేజీ.

వెలుపలి లింకులు

[మార్చు]