Jump to content

పల్లెల్లో వాణిజ్యం

వికీపీడియా నుండి
పల్లెల్లోని సంతలలో వాణిజ్యం చేస్తున్న వ్యక్తులు

గతంలో పల్లెల్లో ప్రజల వద్ద డబ్బు చలామణి చాల తక్కువ. ఎక్కువగా వస్తు మార్పిడి పద్ధతిలోనె వుండేది. కూలీలకు ఒక బళ్ల వడ్లు ఒక రోజు కూలి. వృత్తి పని వారికి మేర రూపంలో ధాన్యం ఇచ్చే వారు. కనుక డబ్బు చలా మణి చాల తక్కువ.

రైతులు తమకు కావలిసినంత తిండి గింజలను దాచుకొని మిగతా దాన్ని అమ్మేవారు. కాని ఎక్కువగా బెల్లం, వేరుశనగ కాయలు, కూరగాయలు, పండ్లు మొదలగునవి మాత్రమే అమ్మేవారు. దాని ద్వారా మాత్రమే రైతులకు డబ్బులు అందేవి. కొన్ని పల్లెలకు కలిపి వారంలో ఒక్క రోజు ఒక ప్రదేశంలో సంత జరిగేది. అందులో రైతులు తమ దైనిందిన ఉత్పత్తులైన, కూరగాయలు, తమలపాకులు మొదలగు వాటిని అమ్ముకునే వారు. వారికి కావలసిన వక్కలు, జిలకర, మిరియాలు, ఉప్పు, మొదలగు వాటిని కొనుక్కునే వారు. కాని ఊర్లలోకి అమ్మ వచ్చే మామూలు వస్తువులకు వస్తు మార్పిడి పద్ధతి అమలులో వుండేది. ఉప్పు కావాలంటే కొంత దాన్యాన్ని ఇచ్చే వారు. వడ్ల విలువ ... ఉప్పు విలువను రైతు మహిళలు బేరీజు వేసుకుని చూసే వారు కాదు. వారికి అతి సులభంగా అందు బాటులో వున్నవి 'వడ్లే'.. ఈ వస్తు మార్పిడి పద్ధతి ఎక్కువగా వడ్లతోనె జరిగేది. చింత పండుకు ఖర్జూర పండ్లు, గనిసె గడ్డలు, ఇచ్చేవారు. ఖర్జూర పండు ఇక్కడ అరుదుగా దొరికేది. ఖర్జూరానికి సమ తూకానికి సత్తు గిన్నెలు, పాత బడిన రాగి పాత్రలు కూడా ఇచ్చేవారు. కాని దాన్యానికి వస్తువులివ్వడం కేవలం పల్లెల్లో మాత్రమే జరిగేది. సంతల్లో ఇటువంటి వ్యాపారం లేదు. అక్కడ ఏవస్తువైనా డబ్బిచ్చి కొనాల్సిందే. డబ్బు చలామణి అతి తక్కువ.

ప్రస్తుతం దాన్యంతో వస్తు మార్పిడి ఎక్కడా లేదు. కాని దాని ఆనవాలుగా .... సీసాలకు, పాత పుస్తకాలకు ఐసు పుల్లలు, చింత గింజలకు గెనిసి గెడ్డలు, కొబ్బారికి కొబ్బెర నూనె, ఆముదాలకు, ఆముదమూ, వేపగింజలకు వేప నూనె, కానుగ గింజలకు కానుగ నూనె ఇలా కొంత వస్తు మార్పిడి ఉంది. పాత ప్లాస్టికి సామానులకు కొత్త ప్రాస్టిక్ సామానులు ఇస్తున్నారు. పాడైన ఇనుప సామాను కూడా తీసుకొని కొత్త పాత్రలను ఇస్తున్నారు. ప్రస్తుతం పట్టణాలలో ఇదొక పెద్ద వ్వాపారం.

ఇవి కూడా చూడండి

[మార్చు]