Jump to content

పల్లెల్లో వైద్యం

వికీపీడియా నుండి

పల్లెల్లో వైద్య విధానము ఇది పెద్దల కాలం మాట. అనగా సుమారు యాబై ఏళ్ల క్రితం మాట. పాత కాలం సంగతులను పల్లెల్లో పెద్దల కాలం మాట అని అంటరు. ఆ రోజుల్లో చిన్న పిల్లలకు, కక్కాయి దగ్గు, బాల గ్రహం, ఎదురు గుతుకులు, తట్టు, అమ్మవారు, గజ్జి, మొదలగు వాదులు వచ్చేవి. పెద్దలకు ఎటు వంటి వ్వాదులు వచ్చేవి కావు. ముసలి తనంలో వచ్చే రోగాలు సామాన్యమే. దెబ్బలు తగలడము, పాము కాటు, తేలు కాటు మొదలగు నవి వుండేవి.

అప్పటికింకా,,,,,,, ప్రభుత్వ ఆస్పత్రులు పల్లె వాసులకు అందు బాటు లోకి రాలేదు. వచ్చినా పల్లెవాసులకు వాటిని అవగాహన చేసుకొని ఉపయోగించుకునే తెలివి వారికి లేదు. ఎక్కడో పట్టణాలలో వుండే ఆస్పత్రులకు ఈ మారు మూల పల్లె వాసులు పోలేరు. పో గలిగినా అక్కడి వారితో ఎలా వ్వహరించాలో తెలియక ఎం మాట్లాడితో ఏం జరుగు తుందో...... అవమాన పడవలసి వస్తుందో...... అనే అనుమానం ఎక్కువ. ఎందుకంటే ఆనాటి పల్లె ప్రజలు రైతులు చాల నిజాయితి పరులు, నిక్కచ్చి మనుషులు, ఆనవసరంగా ఎవరైనా ఒక మాట అనరు, ఒకరు అంటే పడరు. ఆంచేత ... పరావూరికెళ్లి ఎవరినో బతిమాలి బామాలి మందులు తెచ్చుకోవడమేమిటని దాని పై శ్రద్ధచూపరు. తమకు తెలిసిన వైద్యమో...... తమ ఇంటి ముందుకు వచ్చిన వైద్యమో ... దాన్నే ఆశ్ర యిస్తారు. అది పల్లె వాసుల నైజం. ఇది ప్రభుత్యం గ్రహించడం లేదు. అప్పటికి ప్రభుత్వం తమ స్థానాలల్లో పూర్తిగా కూర్చొని సర్దుకోలేదు. ఇంత చిన్న విషయాన్ని ఎలా పట్టించు కోగలదు ?.......... అందు చేత,,,,,,, అప్పటికి ఎంతో కాలం ముందు నుండే అమలలో నాటు వైద్యుల సహకారం ఇంకా ఉపయోగించు కునేవారు.

పిల్లలకు వచ్చే కక్కాయి దగ్గుకు, కుక్కను వేలాడ దీసిన గానుగ చెట్టు కాయను పిల్లల మొల తాడులో కట్టే వారు. బాల గ్రహానికి మంత్రం వేసే వారు వుండే వారు. ఎదురు గుతుకులు అనే వ్వాదికి ఉల్లిపాయలను మత్రించి ఇచ్చి తినమనే వారు. అప్పట్లో బూవమ్మలు ముస్లిం స్త్రీలు పెద్ద జోలె భుజాన వేసుకొని పల్లేల్లో తిరుగుతూ .... కస్తూరి మాత్రలో..... భేది మాత్రలో....... పలాన మాత్రలో...... అని అరుస్తూ పల్లెల్లో తిరిగే వారు. వారి వద్ద గుడ్డ మూటల్లో అనెక రకాల మందులు వుండేవి. చిన్నపిల్లకు కస్తూరి మాత్రలు సర్వ రోగ నివారిణి. ప్రతి రోజు చిన్నపల్లలకు ఒక కస్తూరి మాత్రను పాలలో రంగ రించి పాలాడితో పిల్లలకు తాగించే వారు. అలాగే బేది మాత్రలు అప్పుడప్పుడు పిల్లలకు ఇచ్చేవారు. పసి పిల్లలలకు అముదము కూడా తాగించే వారు. అదేవిదంగా కొంత మంది పెద్దలు వారికి తెలిసిన నాటు వైద్యంచేసే వారు. అప్పుడప్పుడు బయటి నుండి ఎవరో వైద్యులు వచ్చి ఏవో మందులు ఇచ్చేవారు. అవి ఎక్కువగా ఆయుర్వేద మందులు. అమ్మవారు, తట్టు వంటి అంటు వ్యాదులకు ఎటువంటి మందులు వేయకూడదని నియమం వుండేది. అటు వంటి వ్యాధులు వచ్చిన పిల్లవానిని ఇంట్లో కూర్చో బెట్టి వేపాకు నీళ్లతో స్నానం చేయించి, వేప చిగుర్లను మెత్తగా రుబ్బి దాని దేహమంతా లేపనంగా పూసే వారు. ఆవ్యాధి గ్రస్తులున్న ఇంటి ముందు ఆ ఇంటివారు బూడిదతో ఒక అడ్డ పట్టి వేసే వారు. అనగా ఆ ఇంటికి అంటు వున్నదని ఎవ్వరు వెళ్లకూడదని దాని అర్థం. ప్రతి రోజు వచ్చే.... చాకలి కూడా ఆ ఇంటికి రారు. బిచ్చ గాళ్లు కూడా ఆ బూడిద గీతను చూసి వెళ్లి పోతారు. అది అంటు వ్యాధి ఐనందున అది ఇతరులకు సోక కూడదని అన్ని జాగ్రత్తలు తీసు కుంటారు. అప్పట్లో ఇటు వంటి అంటు వ్యాదులకు ప్రభుత్యం తరపున కొందరు 'టీకాలు' వేయ డానికి పల్లెల్లోకి వచ్చేవారు. టీకాలు వేయించు కుంటే పిల్లలకు జ్వరం వచ్చేది. దాంతో భయపడి పిల్లలకు టీకాలు వేయించే వారు కాదు. వారికి కనబడకుండా పిల్లలను దాచేవారు. వచ్చిన వారు ఏమి చేయ లేక వెనుదిరిగి పోయే వారు. ఆ తర్వాత కొంత కాలానికి ప్రభుత్వ బడులు వచ్చాక బడిలో చేరాలంటే టీకాలు వేసిన గుర్తు లుంటేనే బడిలో చేర్చు కుంటాము అనే నిభందన కూడా పెట్టారు. పల్లెల్లో తేలు కాటుకు మంత్రాలేసే వారుండేవారు.. ఇంత లావు ఉన్నావు తేలు మంత్రం కూడా రాదా అనే సామెత వీరి నుండే వచ్చింది. పాము కాటుకు 'దండ' వేసే వారుండేవారు. బాదితులు వీరి ఆశ్రయించేవారు. చెవిలో చీము కారుతుంటే పాములను ఆడించే వాడు వచ్చినప్పుడు వాడు నాగు పాము తోకతో చీము కారు తున్న చెవిలో తిప్పేవాడు. కొండ రాజులు కూడా కొన్ని వన మూకికలను మందులుగా ఇచ్చేవారు. మంత్రాలతో వైద్యం అక్కడక్కడా ఈనాటికి కొనసాగు తున్నది.

చిట్కా వైద్యం, ఆకు పసరుల వైద్యం, మంత్రాలతో వైద్యం బహుళ ప్రచారంలో వుండేది. కాలిలో ముల్లు గుచ్చుకుంటే చేతి మీద రుద్దితే కాలిలో విరిగిన ముల్లు బయటకు వచ్చేది. తేలు మంత్రం గాళ్లు, పాము కరిస్తే దండలు వేసే వాళ్లు, జెర్రి కాటుకు ఎర్ర నీళ్లు ఇచ్చేవారు అక్కడక్కడా పల్లెల్లో వుండే వారు. కాని వారు తాము చేసిన పనికి ప్రతి ఫలము ఆశించే వారు కాదు. అంతా ఉచితమే. అదే విధంగా అప్పట్లో ఎక్కడో ఆంధ్ర ప్రాంతంలో చాల దూరంలో పాముల నర్సయ్య అనే ఒక రైల్వే ఉద్యోగి వుండే వాడు. అతను రాష్ట్ర వ్వాప్తంగా ప్రసిద్దుడు. ఎవరికి పాము కాటేసినా అతనికి ఫోన్ చేసి చెప్పితే ఫోన్ లోనే మంత్రం వేసే వాడు. అతని ఫోన్ నెంబరు చాల మందికి సుపరిచితమే. దగ్గర్లోని రైల్వే స్టేషనుకు వెళ్లితే వారే పాముల నర్సయ్యకు ఫోన్ కలిపి ఇచ్చేవారు. అతనికి ఈ పని చేయడానికి రైల్వే శాఖ కూడా సహకరించిందని చెప్పుకునేవారు. చిన్న చిన్న దెబ్బలకు, గాయాలకు ఆకు పసరు వైద్యం పెద్ద వారి అందరికి తెలిసిన విద్యే. మందు కన్నా మందు ఇచ్చే వారి మీద నమ్మకంతో వారికి అ వ్వాది నమయమయేది. ఇది సహజమేగదా..

ఈనాడు ఎంత వైద్య విధానము అభివృద్ధి చెందినా.. వైద్యుల వద్దకు, ఆస్పత్రులకు వెళ్లి మందులు తెచ్చుకున్నా పసర వైద్యం, మంత్రాల వైద్యం ఇప్పతికి కొంతైనా కొనసాగు తున్నది. వారికి నమ్మకమున్నది. రోగం నయమవుతిన్నది. రోగికి కావలసిందదే కదా... .

ఇవి కూడా చూడండి

[మార్చు]