Jump to content

పవన్ రాజ్ గోయల్

వికీపీడియా నుండి
పవన్ రాజ్ గోయల్
జననం (1952-02-19) 1952 ఫిబ్రవరి 19 (వయసు 72)
అహ్మదాబాదు, భారతదేశం
వృత్తిభారత రాష్ట్రపతికి మాజీ వైద్యుడు (Hon. 2012-2017)
భార్య / భర్తడా. సునేనాగోయల్
పిల్లలుడా.శ్రీవాంషు రాజ్ గోయల్, అశ్విన్ రాజ్ గోయల్
తల్లిదండ్రులుఎం.పి. గోయల్ (తండ్రి)
పురస్కారాలుపద్మశ్రీ

పవన్ రాజ్ గోయల్ భారతీయ పల్మనాలజిస్ట్ (ఊపిరితిత్తుల శాస్త్రవేత్త). అతను బోస్టన్ లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాడు.[1] వైద్య రంగానికి అతను చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2014లో నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ తో సత్కరించింది.[2]

జీవిత చరిత్ర

[మార్చు]

హర్యానాకు చెందిన పవన్ రాజ్ గోయల్ 1974లో న్యూఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ నుండి మెడిసిన్ లో పట్టభద్రుడయ్యాడు. న్యూఢిల్లీలోని ఇర్విన్ ఆసుపత్రిలో తన రెసిడెన్సీని పూర్తి చేశాడు.[3] చెన్నైలోని ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ తో సహా వివిధ ఆసుపత్రులు, సంస్థలలో ప్రొఫెసరుగా , ఛాతీ-ఊపిరిత్తుల మెడిసిన్ విభాగానికి అధిపతిగా పనిచేశాడు. అక్కడ అతను ప్రొఫెసర్ ఎమెరిటస్ హోదాను కలిగి ఉన్నాడు.[1]

పిఆర్జి మెడికేర్స్ అండ్ రీసెర్చెస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరుగా ఉండటంతో పాటు, 1990 నుండి టేబుల్వేర్ తయారీ వాణిజ్య సంస్థ అయిన ఓషో సెరామిక్స్ కు కూడా అతను అధిపతిగా ఉన్నాడు.[1][3][4] అతను ఉద్యోగ్ గౌరవ్ , సమాజ్ శ్రీ పురస్కారాలను అందుకున్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "India Medical Times". India Medical Times. 2014. Archived from the original on 9 August 2014. Retrieved 3 November 2014.
  2. "Padma 2014". Press Information Bureau, Government of India. 25 January 2014. Retrieved 28 October 2014.
  3. 3.0 3.1 3.2 "SRM University". SRM University. 2014. Archived from the original on 19 July 2019. Retrieved 3 November 2014.
  4. "Osho Ceramics". Osho Ceramics. 2014. Retrieved 3 November 2014.

బాహ్య లింకులు

[మార్చు]