పవార్ రామారావు పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పవార్ రామారావు పటేల్

పదవీ కాలం
2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం
ముందు గడ్డిగారి విఠల్ రెడ్డి
నియోజకవర్గం ముధోల్

వ్యక్తిగత వివరాలు

జననం 1954
భైంసా, నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి పవార్ శ్యామ్ రావు పటేల్
మూలం [1]

పవార్ రామారావు పటేల్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

పవార్ రామారావు పటేల్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఆయన ఆ తరువాత నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసి కాంగ్రెస్ పార్టీకి 15 నవంబర్ 2022న రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3] పవార్ రామారావు పటేల్ 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డిగారి విఠల్ రెడ్డి పై 23419 ఓట్ల మెజారితో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4][5][6]

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా చేయడం, ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించి, డిసెంబర్ 14న గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై అనంతరం ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[7]

పవార్ రామారావు పటేల్ ను 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.[8] ఆయనను ఫిబ్రవరి 14న బీజేపీ శాసనసభ ఆఫీస్ సెక్రటరీగా నియమించింది.[9]

మూలాలు[మార్చు]

  1. "Pawar Ramarao Patil 2023 Election Affidavit" (PDF). 2023. Archived from the original (PDF) on 13 January 2024. Retrieved 13 January 2024.
  2. 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. The New Indian Express (15 November 2022). "Nirmal DCC president quits, likely to join BJP". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
  4. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  5. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  6. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
  7. NTV Telugu (14 December 2023). "ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం." Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  8. Andhrajyothy (9 January 2024). "17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జిలు". Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
  9. Andhrajyothy (14 February 2024). "బీజేపీఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.