Jump to content

పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవే

వికీపీడియా నుండి
పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవే
అలీ యావర్ జంగ్ మార్గ్
పటం
ఎరుపు రంగులో పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవే
Mumbai 03-2016 109 Western Express Highway near Bandra.jpg
బాంద్రా వద్ద పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవే
మార్గ సమాచారం
నిర్వహిస్తున్న సంస్థ MMRDA[1] MSRDC
పొడవు25.33 కి.మీ. (15.74 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తర చివరమీరా రోడ్డు వద్ద ఎన్‌హెచ్48
Major intersectionsవీర సావర్కర్ రోడ్, జనరల్ ఎ.కె.వైద్య మార్గ్
జోగేశ్వర్ లో JVLR
శాంటాక్రజ్‌లో SCLR
అంధేరి కుర్లా రోడ్
సహార్ రోడ్
సహార్ ఎలివేటెడ్ యాక్సెస్ రోడ్
స్వామి వివేకానంద రోడ్
దక్షిణ చివరబాంద్రా వోర్లి సీ లింక్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుమహారాష్ట్ర
Districtsముంబై సబర్బన్
Major citiesముంబై
రహదారి వ్యవస్థ

పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవే (WEH)[2] ముంబైలో ఉత్తర-దక్షిణ దిశల్లో సాగే 8-10 వరుసల ఆర్టీరియల్ రోడ్డు. ఇది మీరా రోడ్ శివారు నుండి విస్తరించి బాంద్రా వరకు 25.33 కి.మీ. (15.74 మై.) పొడవున ఉంది.[3] దీనికి మహారాష్ట్ర మాజీ గవర్నరు పేరిట అలీ యావర్ జంగ్ మార్గ్ అని పేరుపెట్టారు. ఇది మాహిమ్ క్రీక్ దగ్గర మొదలై నగర ఉత్తరభాగం లోని కాషిమీరా వరకు వెళ్ళి, ఘోడ్‌బందర్ గ్రామం వద్ద జాతీయ రహదారి 48ని కలుస్తుంది. ఈ రహదారి ముంబై నగరాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా నగర శివారు ప్రాంతాలకు కలుపుతుంది.

నేపథ్యం

[మార్చు]
అంధేరి ఫ్లై ఓవర్

ముంబై నగర పశ్చిమ ప్రాంతంలోని ఎస్వీ రోడ్డులో రద్దీని తగ్గించడంలో ఈ రహదారి కీలకమైనది. పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవేలో అనేక ఫ్లైఓవర్‌లు నిర్మించారు. అంధేరీ ఫ్లైఓవర్ (2002 లో ప్రారంభమైంది) అనేది విలే పార్లే, బాంద్రా తదితర ప్రాంతాల వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ లైట్లునేవి లేకుండా ఉండేందుకు పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవేపై నిర్మించిన ఫ్లైఓవర్‌లలో ఒకటి. హైవేపై సాధారణ ట్రాఫిక్ జామ్‌లను నివారించడానికి విలే పార్లే నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించడానికి MSRDC ఇటీవల మరో ప్రాజెక్ట్‌ను చేపట్టింది. జాతీయ ఉద్యానవనం, దిండోషి, ఠాకూర్ కాంప్లెక్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, పఠాన్‌వాడి, గోరేగావ్, JVLR, సెంటార్, వకోలా ఖేర్వాడిల వద్ద కొత్తగా ఫ్లైఓవర్‌లు నిర్మించారు. వాహనదారులు ఇప్పుడు దహిసర్ నుండి బాంద్రా వరకు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా ప్రయాణించవచ్చు. ఎక్స్‌ప్రెస్ హైవేలో రాత్రి వేళ రోడ్డు మెరుగ్గా కనిపించడం కోసం కొత్త రిఫ్లెక్టర్‌లను ఏర్పాటు చేసారు. హైవేలోని ప్రధాన జంక్షన్‌ల వద్ద దిశలను సూచించే బోర్డులను ఏర్పాటు చేశారు. గత దశాబ్దంలో, మెరుగైన సంకేతాలను అమర్చడం, ల్యాండ్‌స్కేపింగ్‌కు మెరుగుదలలు, లేన్‌ల గుర్తింపు, రంగులు వేసిన పక్క గోడలు, పాదచారుల వంతెనల వంటి ఏర్పాట్లు చేసారు.

ఎయిర్‌పోర్ట్ ఫ్లైఓవరు సొరంగాలు, వంతెనలతో WEHకి కలుపుతుంది. దీన్ని సహార్ ఎలివేటెడ్ యాక్సెస్ రోడ్ అని కూడా అంటారు. విమానాశ్రయం ఫ్లైఓవర్ 2014 లో పూర్తయింది. పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవేపై వెళ్ళే వాహనదారులు దీని ద్వారా కొత్త టెర్మినల్‌ను సులభంగా చేరుకోవచ్చు. గతంలో ఈ విగ్రహం విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్ వద్ద ఉండే ఛత్రపతి శివాజీ మహారాజా విగ్రహాన్ని SEAR ప్రవేశ ద్వారం దగ్గరకు మార్చారు.

పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవే, తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవేలను కలిపే ముంబై సబర్బన్ రోడ్ నెట్‌వర్క్ లోని ప్రధాన ఆర్టీరియల్ రోడ్లలో జోగేశ్వరి - విఖ్రోలి లింక్ రోడ్ (JVLR) శాంతా క్రజ్ - చెంబూర్ లింక్ రోడ్ (SCLR) లు ప్రధానమైనవి. పశ్చిమ, తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవేలు రెండూ ఉత్తరం నుండి దక్షిణంగా నడుస్తాయి. కొన్ని చోట్ల ఇవి సమాంతరంగా నడుస్తాయి.[4]

సమాంతర రైలు లింకులు

[మార్చు]

పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవే చాలావరకు, ముంబై సబర్బన్ రైల్వే లోని పశ్చిమ మార్గానికి సమాంతరంగా ఉంటుంది.

ముంబై మెట్రో మాస్టర్ ప్లాన్‌లో భాగంగా, రెడ్ లైన్ 2022 ఏప్రిల్ నుండి వినియోగం లోకి వచ్చింది. లైన్ 9 (ముంబై మెట్రో) పొడిగింపును పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవేపై భయందర్ నుండి దహిసార్ తూర్పు వరకు ముంబై T2 విమానాశ్రయం వరకు నిర్మిస్తున్నారు. ఇందులో ముంబై మెట్రో లోని ఎల్లో, ఆక్వా, గ్రీన్, గోల్డ్, రెడ్ లైన్ల పొడిగింపులతో ఆరు ఇంటర్‌ఛేంజ్‌లు ఉంటాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవే
  • SEAR

మూలాలు

[మార్చు]
  1. "MMRDA - Projects - Mumbai Urban Infrastructure Project". Mmrdamumbai.org. Retrieved 2010-07-27.
  2. Chacko, Benita (18 September 2017). "Western Express Highway: Few know this arterial road honours a former diplomat". Indian Express. Retrieved 21 March 2019.
  3. Brihanmumbai Municipal Corporation (BMC). "Urban Transportation" (PDF). BMC. p. 1. Archived from the original (PDF) on 2 నవంబర్ 2013. Retrieved 7 April 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  4. MMRDA (2002-06-30). "EA/EMP report of JVLR (Jogeshwari - Vikhroli Road) project under MUTP : Mumbai. Vol. 3 of India - Mumbai Urban Transport Project (MUTP) : environmental impact assessment". India: World Bank. p. 41. Retrieved 7 April 2014.