పసల పెంచలయ్య
పసల పెంచలయ్య | |
---|---|
![]() పసల పెంచలయ్య | |
జననం | 1940 నెల్లూరు జిల్లా - తుమ్మూరు |
మరణం | జూన్ 8,2015 |
నివాస ప్రాంతం | నెల్లూరు జిల్లా - తుమ్మూరు |
ప్రసిద్ధి | వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయనాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖమంత్రి |
పసల పెంచలయ్య వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయనాయకులు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖమంత్రిగానూ పనిచేశారు.నెల్లూరుజిల్లాలో రాజకీయంగా దళిత నాయకుల్లో గుర్తుంచుకోదగ్గ వ్యక్తి.
జీవిత విశేషాలు[మార్చు]
ఆయన నెల్లూరు జిల్లా నాయడుపేట పట్టణ పరిధిలోని తుమ్మూరు దళితవాడలో 1940 ప్రాంతంలో ఆయన జన్మించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిగా నెల్లూరు జిల్లాలోనే బాధ్యతలు చేపట్టారు. పౌరసంబంధాల శాఖాధికారిగా మెదక్, ప్రకాశం జిల్లాలలో పనిచేశారు. స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ప్రోత్సాహంతో ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. 1979లో తిరుపతి లోక్ సభ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1984లో అదే తిరుపతి నుండి ఓడిపోయారు. 1989అసెంబ్లీ ఎన్నికల్లో సూళ్లూరుపేట అసెంబ్లీ నుండి పోటీచేసి గెలిచారు. 1992-94ల మధ్య నేదురుమల్లి క్యాబినెట్ లో సమాచారశాఖ మంత్రిగా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి క్యాబినెట్ లో గృహనిర్మాణశాఖ మంత్రిగా పనిచేసారు. 1994, 1999ఎన్నికల్లో ఇదే సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి ఆయన ఓడిపోయారు. 2004, 2009లలో తిరిగి సీటు కోసం ప్రయత్నించినా నెలవల సుబ్రహ్మణ్యం ఎగరేసుకుపోయాడు. 2014ఎన్నికలకు ముందు ఆయన తన అల్లుడు కిలివేటి సంజీవయ్యతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ లో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో సూళ్లూరుపేట వైకాపా అభ్యర్థిగా నిలబడ్డ తన అల్లుడు సంజీవయ్యను గెలిపించుకోవడంలో ఆయనకున్న మంచిపేరు ఎంతగానో ఉపయోగపడింది.[1]
మరణం[మార్చు]
ఆయన ఈ జూన్ 8 2015 న కన్నుమూసారు. ఆయన కొంతకాలంగా అశ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, . అయినా ఫలితం లేకపోయింది. పెంచలయ్య వయస్సు 75సంవత్సరాలు.