పసుపులేటి తాతారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పసుపులేటి తాతారావు తెలుగు రచయిత[1].

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన సామర్లకోటలో జన్మించారు. రాజమండ్రిలో స్థిరపడ్డారు.ఆంధ్రాబ్యాంక్‍లో ఆఫీసర్‍గా ఉద్యోగం చేస్తున్నారు. 1988 నుంచి రచనలు చేస్తున్నారు. అనేక కథలు, నవలలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. అనేక బహుమతులు సంపాదించుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన సి.పి.బ్రౌన్ అకాడెమీ కథల పోటీలో 2009 సంవత్సరానికి గానూ ప్రథమ బహుమతి పొందియున్నారు. వీరి నవలల్లో రెండు ప్రముఖ దిన, వార పత్రికల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు సంపాదించుకుని సీరియల్‍గా ప్రచురితమయ్యాయి. మొట్టమొదటి కథ "అదృష్టవంతుడా ... సిగ్గుపడు" ఆంధ్రప్రభ వార పత్రికలో ప్రచురితమైంది. మొట్టమొదటి నవల "యాదృచ్ఛికం" ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్‍గా వచ్చింది. 'ప్రయోగం' అనే నవల కన్నడ భాషలోకి అనువదించబడింది[2]. 'ది ఫ్యూచర్ - రేపు'[3] అనే నవలని ఏలూరుకు చెందిన శ్రీకా (శ్రీ కాట్రగడ్డ) అనే ఒక అభిమాని ఆడియో సి.డి.గా చదివి తన అభిమానాన్ని ప్రదర్శించుకున్నారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

https://tatapasupuleti.wordpress.com/+[permanent dead link]