పాకాల వన్యప్రాణుల అభయారణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు తీరము చుట్టూ పాకాల వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నది.

ఈ అభయారణ్యం దాదాపు 839 చ.కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది కాకులు దూరని కారడవే అయినా పర్యాటకులకు అనువైనదే. ఇది వివిధ రకాల వృక్షజాలం మరియు జంతుజాలంను సంరక్షించే కేంద్రంగా విలసిల్లుతోంది. ఈ అభయారణ్యంలో చిరుతపులులు, మానిటర్ బల్లులు, మొసళ్లు, ఎలుగుబంట్లు, హైనాలు, కొండచిలువలు మరియు తోడేళ్ళు వంటి జంతువులు పర్యాటకులకు కన్నుల విందు చేస్తాయి.