Jump to content

పాదు

వికీపీడియా నుండి
మామిడి చెట్టుకు ఏర్పాటుచేసిన ఒక పాదు

చెట్లకు కావలసినంత నీరును నిల్వ ఉంచడానికి చెట్టు చుట్టూ మట్టితో ఏర్పాటు చేసుకున్న మట్టి కట్టను పాదు అంటారు[1]. ఈ పాదుల యొక్క పరిమాణం చెట్ల పరిమాణాన్ని బట్టి, చెట్ల వయసును బట్టి, చెట్ల రకాలను బట్టి, నేలను బట్టి, నీటి సౌకర్యాన్ని బట్టి మారుతుంటాయి.

పాదుల వలన లాభాలు

[మార్చు]
  1. నీటిని పొదుపుగా వాడుకోవచ్చు, అందువలన నీరు వృద్ధా కాదు.
  2. చెట్టుకు వేసే ఎరువులు పాదులోనే వేస్తారు కాబట్టి అవి నీరు ద్వారా మరొక చోటుకు కొట్టుకుపోకుండా ఈ మట్టి కట్ట పాదులు అడ్డుకుంటాయి.
  3. సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా ఈ మట్టి కట్ట పాదులు అడ్డుకుంటాయి.
  4. ఈ పాదుల వలన రైతు తన పనిని వేగవంతంగా సమర్ధవంతంగా పూర్తి చేయగలుగుతాడు.
  5. పాదుల వలన చెట్లు బాగా పెరుగుతాయి, మంచి ఫలాలను అందిస్తాయి.
  6. పాదుల వద్ద వానపాములు వంటివి మొక్కలకు మేలు చేసే జీవులు త్వరగా వృద్ధి చెందుతాయి.

మూలాలు

[మార్చు]
  1. "పాదు | అమర్కోష్ - భారతదేశం యొక్క నిఘంటువు". అమర్కోష్.భారత్. Retrieved 2023-04-15.
"https://te.wikipedia.org/w/index.php?title=పాదు&oldid=3885790" నుండి వెలికితీశారు