Jump to content

పామిరెడ్డి ఘంటారెడ్డి

వికీపీడియా నుండి

శ్రీ పామిరెడ్డి ఘంటారెడ్డి[1] గారు డోకిపర్రు గ్రామంలో జన్మించారు.  వీరి తండ్రి గంగయ్య.19.6.1930 తేదీన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న కారణంగా రాజమండ్రి, తిరుచునాపల్లి, అలీపురం జైళ్ళలో శిక్ష అనుభవించారు. 14.3.1931 న, గాంధీ-ఇర్విన్ ఒప్పందంతో జైలు నుంచి విడుదలయ్యారు. బందరులో 27.3.1932 నాడు, విదేశీ వస్త్రాలయాల ముందు పికెటింగ్ చేసి పోలీసు వారిచే లాఠీ చార్జీకి గురయ్యారు. వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొన్నందున,  26.4.1941 న అలీపురం జైలులో మూడు నెలల కఠిన శిక్ష,, రు. 100/- జరిమానా విధించారు. డోకిపర్రు దేవాలయాలతో వీరికి ఉన్న అనుబంధం మెండు. జాతీయ కాంగ్రెస్ పధకం "ఇంటింటి ముద్ద..గుడిలో కూడు" ద్వారా, గ్రామంలోని స్వాతంత్ర్య సమరయోధులు, ఇంటింటికి తిరిగి అన్నం సేకరించి, దానిని గుడిలో అందరు కలిసి భుజించేవారు. గాంధీజీ షరతు ప్రకారం, హరిజన పేటలో కూడా అన్నం సేకరించాలి. ఈ ఫథకాన్ని పామిరెడ్డి ఘంటారెడ్డి గారు, చాకచక్యంగా గ్రామ అగస్తేశ్వర స్వామి ఆలయంలో అమలు చేశారు.

  1. సుధీర్ రెడ్డి, పామిరెడ్డి (2021). మా చెట్టు నీడ, అసలేం జరిగింది. కస్తూరి విజయం. pp. 72, 73, 02. ISBN 978-93-5445-095-2.