పారనంది జగన్నాధస్వామి
స్వరూపం
పారనంది జగన్నాధ స్వామి (1886-?) ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, నాటక కర్త.
వీరు శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి గ్రామంలో 1886 నవంబరు 11 తేదీన రామశాస్త్రి, వెంకట మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. వీరు తండ్రి వద్దనే తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. విజయనగరం మహారాజా కళాశాల నుండి పట్టా అందుకున్నారు. కలకత్తాలో ఎం.ఏ. పూర్తిచేశారు.
వీరు కొంతకాలం పర్లాకిమిడి కళాశాలలో లాజిక్ లెక్చరర్ గా, అనంతరం ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు.
వీరు ఆంధ్రపత్రిక దినపత్రికలో వారం వారం "కలగూరగంప" శీర్షిక ద్వారా ఎన్నో మనోవైజ్ఞానిక వ్యాసాలు చదువరులకు అందించారు. అలాగే "వాసనలు" పేరుతో మానసిక విజ్ఞాన సంబంధ వ్యాసాలు వ్రాశారు.
రచనలు
[మార్చు]- మనశ్శరీరాలపై పరిసరాల ప్రభావం
- దేశభక్తి
- విష్ణు పురాణం
- ఆత్మ జిజ్ఞాస
- సావిత్రి
- సముజ్వాలాన
- సుధాశ్రీ
- వెల్ఫేర్ ఇన్ ఇంసియంట్ ఇండియా
- విమర్శక వ్యాసావళి (1954)[1]
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- జగన్నాధస్వామి, పారనంది, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 199.