పార్కింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పార్కింగ్
దర్శకత్వంరామ్‌కుమార్ బాలకృష్ణన్
రచనరామ్‌కుమార్ బాలకృష్ణన్
కథరామ్‌కుమార్ బాలకృష్ణన్
నిర్మాతసుధన్ సుందరం
కె. ఎస్. సినీష్
తారాగణం
ఛాయాగ్రహణంజిజు సన్నీ
కూర్పుఫిలోమిన్ రాజ్
సంగీతంసామ్ సి.ఎస్
నిర్మాణ
సంస్థలు
ప్యాషన్ స్టూడియోస్ అండ్ సోల్జర్స్
సోల్జర్స్ ఫ్యాక్టరీ
విడుదల తేదీ
1 డిసెంబర్ 2023
దేశంభారతదేశం
భాషతమిళం
బాక్సాఫీసు₹ 1.92 కోట్లు[1]

పార్కింగ్ 2023లో తమిళంలో విడుదలైన డ్రామా థ్రిల్లర్ సినిమా.[2] ప్యాషన్ స్టూడియోస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై సుధన్ సుందరం, కెఎస్ సినీష్ నిర్మించిన ఈ సినిమాకు రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించాడు. హరీష్ కళ్యాణ్, ఎంఎస్ భాస్కర్, ఇంధూజ రవిచంద్రన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా 1 డిసెంబర్ 2023న థియేటర్‌లలో విడుదలై[3], డిసెంబ‌ర్‌ 30 నుండి డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్ ఓటీటీలో త‌మిళంతో పాటు తెలుగు, మ‌ళ‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4][5]

నటీనటులు[మార్చు]

  • హరీష్ కళ్యాణ్ - ఈశ్వర్‌[6]
  • ఎంఎస్ భాస్కర్ - ఎస్ ఇలంపరుతి
  • ఇంధూజ - ఆదిక
  • రామ రాజేంద్ర - సెల్వి
  • ప్రార్థన నాథన్ - అపర్ణ
  • ఇళవరసు - హౌస్ ఓనర్‌
  • విజయ్ సత్య - పోలీస్ ఇన్‌స్పెక్టర్‌

కథ[మార్చు]

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే ఈశ్వ‌ర్ (హ‌రీష్ క‌ళ్యాణ్‌) ఆతిక‌ (ఇందూజ‌)ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ ఇంట్లో అద్దెకు దిగుతారు. గర్భవతిగా ఉన్న ఆతిక‌ను హాస్పిట‌ల్‌కు రెగ్యుల‌ర్ చెక‌ప్‌కు తీసుకువెళ్లే క్రమంలో ఈశ్వ‌ర్‌ ఆటో, క్యాబ్‌లు దొర‌క్క ఇబ్బంది ప‌డ‌తాడు. ఈ క్రమంలో వ్యక్తిగత పనులతో పాటు ఆఫీస్ అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కొత్త కార్ కొంటాడు. కింది వాటాలో నిజాయితీప‌రుడైన ప్ర‌భుత్వ ఉద్యోగి ఏక‌రాజ్‌ (ఎంఎస్‌భాస్క‌ర్‌) త‌న భార్య‌, కూతురు అప‌ర్ణ‌తో (పార్థ‌నా నాథ‌న్‌) క‌లిసి ప‌దేళ్లుగా అద్దెకు ఉంటుంటాడు. ఈ క్ర‌మంలో కారు పార్కింగ్ విష‌యంలో ఈశ్వ‌ర్‌కు భాస్క‌ర్‌తో త‌రుచూ గొడ‌వలు జ‌రుగుతూ ఒక‌రిని ఒక‌రు తీవ్రంగా కొట్టుకుని, కేసులు పెట్టుకునే స్థాయికి వెళ‌తారు. కారు పార్కింగ్ స్థలం కారణంగా చెలరేగిన వివాదం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[7]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ప్యాషన్ స్టూడియోస్ అండ్ సోల్జర్స్ ఫ్యాక్టరీ
  • నిర్మాత: సుధన్ సుందరం, కెఎస్ సినీష్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌కుమార్ బాలకృష్ణన్
  • సంగీతం: సామ్ సి.ఎస్
  • సినిమాటోగ్రఫీ: జిజు సన్నీ
  • ఎడిటర్: ఫిలోమిన్ రాజ్

మూలాలు[మార్చు]

  1. "Parking Box Office Collection Day 4 Prediction: Harish Kalyan's Film Set To Maintain Steady Growth". 2023-12-04. Archived from the original on 2023-12-05. Retrieved 2023-12-04.
  2. Andhrajyothy (16 November 2023). "అద్దె ఇంటిలో నివసించే వారు.. కారు 'పార్కింగ్‌' ఎక్కడ చేయాలి?". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
  3. Sakshi (16 November 2023). "36 రోజుల్లో పూర్తయిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
  4. Andhrajyothy (29 December 2023). "పార్కింగ్ విష‌యంలో ఇగో ఫైటింగ్‌.. ఓటీటీలోకి త‌మిళ‌ థ్రిల్లర్ డ్రామా!". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
  5. TV9 Telugu (30 December 2023). "ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సెన్సేషన్ 'పార్కింగ్'.. తెలుగులోనూ చూడొచ్చు." Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Andhrajyothy (28 November 2023). "విలన్‌గా నటించాలనే కోరిక నెరవేరింది: యంగ్ హీరో". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
  7. Eenadu (2 January 2024). "రివ్యూ పార్కింగ్‌.. తమిళ సూపర్‌హిట్‌ మూవీ ఎలా ఉంది?". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.

బయటి లింకులు[మార్చు]