పాలకాయలు
Appearance
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
పాలకాయలు ఆంధ్రులకు ప్రత్యేకమైన వంట. వీటిని బియ్యం పిండితో తయారుచేస్తారు. ఇవి కారంగా కరకరలాడుతూ సాయంకాలం స్నాక్స్ లాగా తినడానికి బాగుంటాయి.
కావలసిన పదార్ధాలు
[మార్చు]- బియ్యం పిండి
- వెన్న
- ఉప్పు, కారం, నువ్వుపప్పు, వాము, జీలకర్ర మొదలైనవి.
తయారుచేసే విధానం
[మార్చు]- ఎంత బియ్యం పిండి పాలకాయలు చేద్దామనుకుంటే, సమాన పరిమణంలో నీరు పొయ్యి మీద ఎసరు పెట్టాలి.
- మరుగుతున్న నీటిలో తగినంత ఉప్పు, కారం, నువ్వుపప్పు, వాము, జీలకర్ర, ఇంగువ ఇలా మనకు కావలసినవి వేసుకోవాలి.
- బియ్యం పిండిలో వెన్నముద్ద వేసి, ఉండలు కట్టకుండా బాగా కలపాలి.
- మరుగుతున్న నీటిలో ఈ వెన్న కలిపిన బియ్యం పిండిని పోసి ఉండాలు కట్టకుండా కలపాలి. అడుగంటకుండా గిన్నెను దించి అలా వుంచెయ్యాలి.
- అలా ఉడికిన పిండి అయిదారు గంటలు నానాలి.
- తరువాత చేతికి నూనె రాసుకుంటూ, ఈ మొత్తం పిండిముద్దని కుంకుడు కాయంత ఉండలు చేసుకోవాలి. ఈ గోళీలను ఒక బట్టమీద వేస్తూ ఆరనివ్వాలి.
- పొయ్యిమీద బూరెల మూకుడు పెట్టి వనస్పతి గాని, నూనె గాని పోసి ఒక్కొకసారి చారెడు గోళీలు చొప్పున పోసి వేగనివ్వాలి. గోధుమరంగు వచ్చేవరకు వేగనిచ్చి తీసేస్తుండాలి. వేగిన పాలకాయలను వేడి చల్లారిన తరువాత సీసాలోనో లేదా డబ్బాలోనో పోసి ఉంచుకోవాలి.
చిట్కాలు
[మార్చు]- పాలకాయలకు కొట్టుడు పిండి వాడకూడదు. విసురుడు పిండి కావాలి. కొట్టుడు పిండైతే మరిగే నూనెలో వేసేసరికి టప్పున పేలిపోతాయి.