పింగ్ యాన్ ఫైనాన్షియల్ సెంటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పింగ్ యాన్ ఫైనాన్షియల్ సెంటర్
平安国际金融中心
Ping An Tower Nov.2016.jpg
సాధారణ సమాచారం
స్థితిపూర్తయింది
రకంఆఫీసు & షాపులు
ప్రదేశంనెం. 5033 యిటియాన్ రోడ్డు, ఫుటియాన్ జిల్లా, షెంజెన్, గుయాంగ్డాంగ్, చైనా
భౌగోళికాంశాలు22°32′11″N 114°03′02″E / 22.536399°N 114.050446°E / 22.536399; 114.050446Coordinates: 22°32′11″N 114°03′02″E / 22.536399°N 114.050446°E / 22.536399; 114.050446
నిర్మాణ ప్రారంభం2010[1]
పూర్తి చేయబడినది2017[1]
వ్యయం$1.5 బిలియన్లు (USD, అంచనా)[2]
యజమానిపింగ్ యాన్ ఇన్సూరెన్స్[1]
ఎత్తు
యాంటెన్నా శిఖరం599.1 m (1,966 ft)[1][3][4]
పైకప్పు555.1 m (1,821 ft)[1]
పైకప్పు నేల555.1 m (1,821 ft)[1]
పరిశీలనా కేంద్రం562.2 m (1,844 ft)[5]
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య115, మరియు 5 భూగర్భంలో[1]
నేల వైశాల్యం385,918 మీ2 (4,153,990 చ .అ)[1]
లిఫ్టులు / ఎలివేటర్లు80[1][6]
రూపకల్పన మరియు నిర్మాణం
వాస్తు శిల్పికోహ్న్ పెడెర్సెన్ ఫాక్స్ అసోసియేట్స్[7]
అభివృద్ధికారకుడుపింగ్ యాన్ ఇన్సూరెన్స్[1]
నిర్మాణ ఇంజనీర్తోర్న్టన్ టోమసేటి[3]
ప్రధాన కాంట్రాక్టర్చైనా స్టేట్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ కంపెనీ[1]

పింగ్ ఆన్ ఫైనాన్షియల్ సెంటర్ (పింగ్ ఆన్ ఐ.ఎఫ్.సి. అని కూడా అంటారు) అనేది చైనాలోని షెన్‌జెన్ లో ఉన్న 115 అంతస్థుల ఆకాశహర్మ్యం.[1][8] ఈ భవనాన్ని పింగ్ యాన్ ఇన్సూరెన్స్ మరియు అమెరికన్ నిర్మాణ సంస్థ కోహ్న్ పెడెర్సెన్ ఫాక్స్ అసోసియేట్స్ రూపొందించారు. దీని నిర్మాణం 2017లో పూర్తయింది, ఇది షెన్జెన్లో అత్యంత ఎత్తైన భవనం, చైనాలో 2 వ మరియు ప్రపంచంలో 4 వ ఎత్తైనది.[9] ఈ భవనంలో 562 మీ. ఎత్తులో పరిశీలనా కేంద్రం ఉన్నది ఈ రికార్డును ఇది (షాంఘై టవర్తో) పంచుకుంటుంది.[10]

పురోగతి[మార్చు]

ఈ భవనం ఫ్యూటియన్ లోని షెన్జెన్ లోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో ఉంది. నవంబరు 6, 2007లో పింగ్ యాన్ గ్రూప్ ఈ భవనం కట్టిన 18,931 చదరపు మీటర్ల ప్రాంతాన్ని 1.6568 బిలియన్ల RMBకు వేలం వేసి కొనుగోలు చేసింది. ఈ భవనం యొక్క రూపకల్పన 2008 లో కోహ్న్ పెడెర్సెన్ ఫాక్స్ అసోసియేట్స్ తో నిర్మాణ రూపకల్పన మరియు థోర్న్టన్ టోమోసెట్టి నిర్మాణ రూపకల్పనను అందిస్తుంది. భవన పునాదులను ఆగస్టు 29, 2009 న వేసి నిర్మాణాన్ని నవంబరులో ప్రారంభించారు. ఈ భవనం రూపకల్పనను 2008 లో కోహ్న్ పెడెర్సెన్ ఫాక్స్ అసోసియేట్స్ మరియు థోర్న్టన్ టోమోసెట్టి అందించాయి.

సంవిధాన రహిత సముద్ర ఇసుకతో తయారైన కాంక్రీటును ఉపయోగించడం వలన, ఉక్కు నిర్మాణాలకు హాని జరిగే అవకాశముండడంతో మార్చి 15, 2013 న, నిర్మాణం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. నమూనా పరీక్షల తర్వాత భవన నిర్మాణం పునరుద్ధరించబడింది.

జూలై 15, 2014 ఉదయం 10 మీటర్ల పొడవైన స్టీల్ కాలమ్ ను పైన చేర్చడంతో, ఆకాశహర్మం ఎత్తు 443.8 మీటర్లను అధిగమించింది, కెకె100 టవరు ఎత్తును అధిగమించింది షెన్జెన్లో అత్యంత ఎత్తైన భవంతిగా పేరుపొందింది.

ఈ భవనం ఏప్రిల్ 30, 2015 నాటికి 599 మీటర్ల ఎత్తుతో చైనాలోని రెండవ ఎత్తైన ఆకాశహర్మ్యం అయింది. షాంఘై టవర్ను అధిగమించడానికి ఈ భవనంపై 60 మీటర్ల యాంటెన్నాను నిర్మించి చైనాలోనే అత్యంత ఎత్తైన భవనంగా మార్చాలన్నది అసలైన ప్రణాళిక. కానీ, 2015 ఫిబ్రవరిలో విమాన మార్గాలకు యాంటినా అడ్డుకునే అవకాశం ఉన్న కారణంగా దాని నిర్మాణాన్ని విరమించుకున్నారు.[11][12][13]

లక్షణాలు[మార్చు]

ఈ భవనంలో ఆఫీసు, హోటల్ మరియు రిటైల్ ప్రదేశాలు, ఒక కాన్ఫరెన్స్ సెంటర్ మరియు ఒక హై ఎండ్ షాపింగ్ మాల్ ఉన్నాయి. 116వ అంతస్థులో ఫ్రీ స్కై అనే పరిశీలన కేంద్రం ఉంది.[14]. పేరు సూచించినట్లుగా, ఇది పింగ్ యాన్ బీమా యొక్క ప్రధాన కార్యాలయం. భవనం యొక్క రూపకల్పన ఎంతో ప్రత్యేకమైనది మరియు సొగసైనది. ఇది ప్రధాన అద్దెదారుడయిన పింగ్ యాన్ యొక్క చరిత్ర మరియు విజయాలు ప్రాతినిధ్యం వహించడానికి ఉద్దేశించబడింది. సుమారు 1,700 మెట్రిక్ టన్నుల బరువున్న ఒక స్టెయిన్లెస్ స్టీల్ ఫసాడ్ భవనానికి ఆధునిక రూపకల్పనను అందజేస్తుంది.[2]

ఈ భవనం 378,600 చదరపు మీటర్ల స్థలాన్ని కలిగి ఉంది. 115-అంతస్తుల ఉండి వెడల్పు-నుండి-ఎత్తు కారక నిష్పత్తి 1:10 మరియు 11-అంతస్తుల పోడియంను కలిగి ఉంది. పోడియంతో కలిపి భవనం మొత్తం 495,520 చదరపు మీటర్ల ఫ్లోర్ స్పేస్ ఉంది. ఐదు బేస్మెంట్ అంతస్థులు 90,000 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి. 620,000 మెట్రిక్ టన్నుల టవర్ ఎనిమిది ప్రధాన స్తంభాలను కలిగి ఉంది. వీటి కొలతలు సుమారు 6 నుండి 3.2 మీటర్లుతో, భవన పైభాగంలోని అత్యల్ప స్థాయయిన 2.9 నుండి 1.4 మీటర్లు ఉంటాయి.[2]

ఎలివేటర్లు[మార్చు]

పింగ్ యాన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటరులో 33 డబుల్ డెక్ ఎలివేటర్లు ఉన్నాయి. వీటి వేగం సెకనుకు 10 మీటర్లు వరకు వెళుతుంది.

భవనాన్ని ఎక్కే ప్రయత్నాలు[మార్చు]

జనవరి 2015 లో, డేర్డెవిల్ గా పేరుపొందిన మలేషియన్ ఫోటోగ్రాఫర్ కెయో వీ లూంగ్ పూర్తికాని భవనం పైకి ఎక్కి పైభాగంలోని క్రేన్ నుండి తీసిన ఫోటోలను, వీడియో ఫుటేజ్ను విడుదల చేశాడు.[15][16][17]

ఈ నిర్మాణం తరువాత, ఫిబ్రవరి 19, 2015న జరిగే చైనా న్యూ ఇయర్ రోజున ఇద్దరు రష్యన్ మరియు ఉక్రేనియన్ పట్టణ అన్వేషకులు వాదిమ్ మకోరోవ్ మరియు విటరి రాస్సలోవ్ ఆ ఆంథెరూఫ్స్ కూడా పూర్తికాని భవనం పైకి ఎక్కి పైభాగంలోని క్రేన్ నుండి తీసిన ఫోటోలను, వీడియో ఫుటేజ్ను విడుదల చేశారు.[18][19][20][21]

అక్టోబర్ 30, 2016 న, ఉదయం 1 గంటలకు వెన్ఫాంగ్, ఫిష్స్టేరియర్ మరియు సాండర్ కోలె దీనిని అధిరోహించారు

రెండవ దశ[మార్చు]

ఈ ప్రాజెక్టులోని రెండవ భవనం. ఇది 290 మీటర్లతో 47 అంతస్తుల ఎత్తున్న ఆకాశహర్మం, దీనిని దక్షిణ టవర్గా పిలవబడుతుంది, ఇది ఇంకా పునాది దశలోనే ఉంది. దీని నిర్మాణం 2014 ఏప్రిల్లో ప్రారంభమై 2018 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ సముదాయంలో 3 నుంచి 6 స్థాయిలలో రెండు ఆకాశహర్మాలను కలుపుతున్న రిటైల్ వంతెనలు ఉన్నాయి.[22]

చిత్రమాలిక[మార్చు]

ఇది కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 "Ping An Finance Center". CTBUH. Retrieved 12 May 2013.
 2. 2.0 2.1 2.2 Poon, Dennis C.K.; Gottlebe, Torsten G. (December 2017). "Sky High in Shenzhen". Civil Engineering. Reston, Virginia: American Society of Civil Engineers. 87 (12): 48–53. Archived from the original on 2017-12-16. Retrieved 2017-12-16.
 3. 3.0 3.1 "Ping An International Finance Center". Thornton Tomasetti. Retrieved 8 October 2010.
 4. "Ping An Finance Centre has been had a 60-metre-cut due to air traffic control". Sohu Focus. Retrieved 2015-02-25.
 5. ctbuh. "World's Highest Observation Decks". www.ctbuh.org (in ఆంగ్లం). Retrieved 2018-10-28.
 6. "Schindler to equip China's tallest building". Schindler. Retrieved 7 January 2014.
 7. "Ping An Finance Center". Kohn Pedersen Fox Associates. Retrieved 16 May 2013.
 8. "Pingan International Finance Centre". SkyscraperPage. Retrieved 19 January 2010.
 9. "Work on China's 838-metre high 'Sky City' starts". Emirates 24/7. 23 July 2013. Retrieved 24 July 2013.
 10. ctbuh. "World's Highest Observation Decks". www.ctbuh.org (in ఆంగ్లం). Retrieved 2018-10-28.
 11. "平安国际金融中心成深圳最高楼 年底将成世界第二". Retrieved 6 May 2016.
 12. "深圳平安金融中心". Retrieved 6 May 2016.
 13. "深圳第一高楼平安国际金融中心封顶 高度超过600米". Retrieved 6 May 2016.
 14. "Ping An Finance Center facts and information". The Tower Info. http://thetowerinfo.com/buildings-list/ping-an-finance-center. Retrieved 28 September 2018. 
 15. "Climbing Ping an finacial centre 660meters youtube video". Keow wee Loong. 27 February 2015.
 16. "Malaysian rooftopper hates to be called Spiderman – Nation – The Star Online". thestar.com.my.
 17. "WATCH: Don't Look Down: Terrifying View from World's Second Tallest Building". yahoo.com. 3 March 2015.
 18. on the roofs (8 May 2015). "Shenzhen Centre (660 meters)" – via YouTube.
 19. "Climbing the Shenzhen Finance Centre ontheroofs story with photos and video". Ontheroofs. 8 May 2015. Archived from the original on 21 September 2016.
 20. "Shenzhen birdmen: Two daredevils, one mega-tall tower and a selfie stick (VIDEO)". RT (TV network). Archived from the original on 21 September 2016.
 21. Chan, Casey. "Watching these guys climb a 2165-foot tall tower made my nerves go crazy". Sploid. Retrieved 11 May 2015.
 22. "Ping An Finance Center: Pioneering China's Tallest – Efficiencies of Forms and Structures". CTBUH. Retrieved 12 May 2013.

బాహ్య లింకులు[మార్చు]